Union Minister Suresh Gopi: ఆంధ్రప్రదేశ్ పర్యటనలో ఉన్న కేంద్ర మంత్రి సురేష్ గోపీ నోట తెలుగు పాట వచ్చింది.. సామజవరగమనా.. అంటూ పాట పాడుతూ.. తన ప్రసంగాన్ని ప్రారంభించారు కేంద్ర సహాయమంత్రి సురేష్ గోపీ.. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో కృష్ణవేణి సంగీత నీరాజనం కార్యక్రమంలో పాల్గొన్నారు సురేష్ గోపీ.. మూడు రోజుల పాటు సాగనున్న కృష్ణవేణి సంగీత నీరాజనం కార్యక్రమం.. అయితే, ప్రారంభ కార్యక్రమానికి కేంద్ర మంత్రి సురేష్ గోపి, రాష్ట్ర పర్యాటక శాఖమంత్రి కందుల దుర్గేష్, ఏపీ సృజనాత్మక, సంస్కృతి సమితి ఛైర్ పర్సన్ తేజస్విని పొడపాటి, ఏపీ టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఎండీ ఆమ్రపాలి తదితరులు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా సురేష్ గోపీ మాట్లాడుతూ.. తెలుగు సినిమాలతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు..
Read Also: Pushpa 2: మాకెప్పుడు రూ.1000కోట్ల సినిమా.. తెగ ఫీలవుతున్న తమిళ తంబీలు
తెలుగు సినిమా చాలా అద్భుతం అన్నారు సురేష్ గోపీ.. తెలుగు వాళ్లకి నేను అవకాశాలు ఇస్తాను.. తెలుగు డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, నటులు చాలా ప్రభావం చూపిస్తారంటూ ప్రశంసలు కురిపించారు.. తెలుగు స్క్రిప్ట్ కూడా చాలా అర్ధవంతంగా ఉంటుంది.. తెలుగు సినిమాల క్వాలిటీ ప్రభావం మళయాల సినిమాలపై ఉంటుందన్నారు.. సామజవరగమనా.. అంటూ పాడారు సురేష్ గోపీ.. ఇక, ఒక సంవత్సరం నుంచి కృష్ణవేణి సంగీత నీరాజనం జరుపుకుంటున్నాం.. ఈ గొప్ప సంప్రదాయ సంగీతాన్ని గౌరవించుకోవడం చాలా అద్భుతం.. సీఎం చంద్రబాబు సరికొత్త ఏపీని తయారు చేస్తున్నారు.. ఇక్కడకు వస్తే నా సొంత భూమిలో ఉన్నట్టు ఉంది.. నా ఆదాయం, నా గ్లామర్ మూడో వంతుకు పైగా ఏపీ, తెలంగాణల నుంచి వచ్చినవే అన్నారు.. మైసూరు సంగీత సుగంధ ఫెస్టివల్ కి నేను హాజరయ్యాను.. దైవికమై కృష్ణానదీ తీరాన ఈ కార్యక్రమానికి హాజరవడం ఆనందంగా ఉందన్నారు.. సంగీత టూరిజంకు గ్లోబల్ హబ్ గా ఏపీని అభివృద్ధి చేస్తున్నారు.. ఎంతోమంది అద్భుతమైన సంగీతకారులు తెలుగులోనే ఉన్నారని తగుర్తుచేశారు.
Read Also: Emmanuel Macron: నా పదవికి ఎలాంటి గండం లేదు.. త్వరలోనే కొత్త ప్రధానిని నియమిస్తా..
ఇక, తెలుగు సినిమాల ప్రభావం మలయాళ సినిమాలపై ఉందన్న సురేష్ గోపీ.. కేంద్ర ప్రభుత్వం కళలను ప్రోత్సహిస్తుంది.. కర్ణాటక సంగీతం చాలా గొప్పది.. దేశంలో అనేక ప్రాంతాల్లో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం అన్నారు.. రాష్ట్రంలోని అనేక ఆధ్యాత్మిక కేంద్రాల్లో ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి.. శ్రీకాకుళం, విశాఖపట్నం, మంగళగిరి, తిరుపతి వంటి ప్రాంతాల్లో సంగీత కార్యక్రమాలు జరుగుతున్నాయన్న ఆయన.. ప్రపంచ వ్యాప్తంగా భారతదేశ కళలకు ప్రాచుర్యం కల్పిస్తున్నాం, ప్రదర్శనలు నిర్వహిస్తున్నాం అని వెల్లడించారు.. మరోవైపు.. అంతిమ తీర్పు సినిమాలో కృష్ణం రాజుతో కలిసి నటించాను అని గుర్తు చేసుకున్నారు.. జరుగుతున్న పరిస్థితులను అర్థం చేసుకోవడానికి కామన్ సెన్స్ కావాలి… సిక్స్త్ సెన్స్ అవసరం లేదన్న ఆయన.. శంకరాభరణంతో నేను కర్నాటక మ్యూజిక్‌కు అభిమానిని అని పేర్కొన్నారు.. సాగరసంగమం, శంకరాభరణం… కర్ణాటక మ్యూజిక్ కు రూపాలుగా అభివర్ణించారు కేంద్ర మంత్రి సురేష్ గోపీ..