Ranveer Singh: బాలీవుడ్ స్టార్ యాక్టర్ రణ్వీర్ సింగ్‌కు బెదిరింపు మెసేజ్ వచ్చింది. కోట్ల రూపాయల డబ్బు డిమాండ్ చేస్తూ వాట్సాప్‌కు దుండగుడు వాయిస్ నోట్ పంపించారు. దీనిపై రణ్వీర్ ముంబై పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ముంబై పోలీసులు ఆయన నివాసం వెలుపల భద్రతను పెంచారు. బెదిరింపులు పాల్పడిన వ్యక్తి తనను తాను లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో సంబంధం ఉన్నట్లు పేర్కొన్నాడు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం వాయిస్ నోట్ పంపించిన వ్యక్తిని కనుగొనే పనిలో ఉన్నారు.
Read Also: Naravane Book Row: పుస్తక వివాదంపై స్పందించిన మాజీ ఆర్మీ చీఫ్ నరవాణే..
రణవీర్ సింగ్ మరియు దీపికా పదుకొనే నివసించే హౌసింగ్ సొసైటీలో భద్రత పెంచారు. దీని తర్వాత, పోలీసు సిబ్బంది, ప్రైవేట్ బాడీగార్డులను భారీగా మోహరించడంపై వివరణ కోరుతూ సొసైటీ యాజమాన్యం పోలీసులకు లేఖ రాసింది. గార్డులు చాలా మంది, కొందరు ఆయుధాలు కలిగి ఉండటంతో సొసైటీలో చాలా మంది నివాసితులు అసౌకర్యాన్ని ఎదుర్కొంటున్నారని పేర్కొంది.
ఇంతలో, రణ్వీర్ సింగ్ చివరిసారిగా ఆదిత్య ధార్ యొక్క బ్లాక్‌బస్టర్ ధురంధర్లో కనిపించాడు. నటుడు ఈ సినిమా సీక్వెల్ ధురంధర్: ది రివెంజ్ కోసం సిద్ధమవుతున్నాడు. ఈ చిత్రం మార్చి 19న థియేటర్లలో విడుదల కానుంది.