Range Rover Sport Launched: రేంజ్ రోవర్ తన తొలి మెడ్ ఇన్ ఇండియా రేంజ్ రోవర్ స్పోర్ట్ SUV ను భారత మార్కెట్‌లో విడుదల చేసింది. రెండు పవర్‌ట్రైన్ ఆప్షన్‌లతో 2025 అప్‌డేట్‌లో విడుదలైన ఈ లగ్జరీ SUVకు కొత్త ఫీచర్లు, ఎక్స్‌టీరియర్ పెయింట్ స్కీమ్ అందుబాటులో ఉన్నాయి. దీని ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధర రూ. 1.45 కోట్లుగా నిర్ణయించారు. గత మోడల్‌తో పోలిస్తే దీని ధర రూ. 5 లక్షల మేర పెరిగింది. 2025 రేంజ్ రోవర్ స్పోర్ట్ 3.0 లీటర్ పెట్రోల్, 3.0 లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్‌లతో టాప్-స్పెక్ డైనమిక్ HSE వేరియంట్‌లో అందుబాటులో ఉంటుంది. ఈ SUV కోసం ఫూజీ వైట్, సెంతోరిణి బ్లాక్, జియోలా గ్రీన్, వెరసిన్ బ్లూ, చారెంట్ గ్రే వంటి ఐదు కస్టమైజ్ చేయదగిన ఎక్స్‌టీరియర్ పెయింట్ స్కీమ్‌లను అందిస్తున్నారు.
Also Read: BCCI: కీలక పదవుల్ని భర్తీ చేసేందుకు సిద్ధమైన బీసీసీఐ..
ఈ లగ్జరీ SUVలో అధునాతన ఫీచర్లను అందించారు. ఇందులో 13.1-అంగుళాల పివి ప్రో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, 13.7-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ ప్లే, హెడ్ అప్ డిస్ ప్లే, ఎయిర్ ప్యూరిఫయర్, డైనమిక్ ఎయిర్ సస్పెన్షన్, అడాప్టివ్ ఆఫ్-రోడ్ క్రూజ్ కంట్రోల్, డిజిటల్ LED హెడ్లాంప్‌లు ముఖ్యమైనవిగా చెప్పుకోవచ్చు. ఈ SUVలో సెమీ అనిలిన్ లెదర్ సీట్లు, మసాజ్ ఫ్రంట్ సీట్లు వంటి కొత్త ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇవి ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చుతాయి.
Also Read: Effect On Male Fertility: మగాళ్లు జాగ్రత్త.. ఇలా చేస్తే మీ సంతానోత్పత్తిపై తీవ్ర సమస్యలు తలెత్తుతాయి
ఈ కారు లాంచ్ ఈవెంట్‌లో JLR ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ రాజన్ అంబా మాట్లాడుతూ.. తాజా రేంజ్ రోవర్ స్పోర్ట్ సెక్టార్‌లో కొత్త ప్రమాణాలను స్థాపిస్తుంది. ఇది మా అత్యంత అధునాతన, డైనమిక్ కేపబుల్ వాహనాల్లో ఒకటిగా నిలుస్తుంది. సెమీ-అనిలిన్ లెదర్ సీట్లు, మసాజ్ ఫ్రంట్ సీట్లు ఇంకా హెడ్ అప్ డిస్ ప్లే వంటి ఫీచర్లతో, మా కస్టమర్లకు ఈ SUV లో మంచి సౌకర్యం, టెక్నాలజీ అనుభూతిని అందించేలా ప్లాన్ చేసామని ఆయన తెలిపారు. మెడ్ ఇన్ ఇండియా రేంజ్ రోవర్ స్పోర్ట్ లగ్జరీ, సాంకేతికత, పనితీరును సమిష్టిగా అందిస్తూ రేంజ్ రోవర్ బ్రాండ్ ప్రతిష్టను మరింత ఉజ్జ్వలంగా నిలబెట్టేలా కనపడుతోంది.