Rana : దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని అంటారు పెద్దలు. అందుకే చాలా మంది పెద్దల మాటను తూచా తప్పకుండా పాటిస్తారు. అందుకే ఒకే ఆదాయవనరుపై ఆధారపడకుండా సైడ్ బిజినెస్‌లు కూడా చేస్తున్నారు. ఈ క్రమంలోనే హీరో రానా దంపతులు హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఫుడ్ స్టోర్స్ అనే షాప్‌ను జనవరిలో ప్రారంభించారు. ఈ స్టోర్ లో కూరగాయలు, పండ్లు, మాంసం, దుస్తులు, షూలు, బ్యాగ్స్, హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ ఇలా అన్నీ లభిస్తాయి. అయితే సామాన్యుడు ఈ స్టోర్ కు వెళ్లలేడు. కొనలేడు. కారణం ఈ స్టోర్ లో అన్నీ ప్రీమియం సరుకులే ఉంటాయి. బయట ఎక్కడా దొరకని అంతర్జాతీయ ఐటమ్స్ ఇక్కడ లభిస్తుంటాయి.
Read Also:Ritu Varma: రొమాంటిక్ సీన్స్ లో నటించడానికి నాకు అభ్యంతరం లేదు : రీతూ వర్మ
ఈ ఫుడ్ స్టోరీస్‌లో స్మూతీస్, జ్యూస్, కాఫీ, చాక్లెట్స్, నూడుల్స్.. ఇలా చాలా ఉంటాయి. క్రికెటర్ విరాట్ కోహ్లి వంటి ప్రముఖులు ఉపయోగించే వాటర్ బాటిల్స్ కూడా లభిస్తాయి. విదేశాల్లో మాత్రమే దొరికే ప్రత్యేక చీజ్‌లు, డ్రై ఫ్రూట్స్ ఇక్కడ అందుబాటులో ఉంటాయి. దాదాపు ఆరు కిలోల మష్రూమ్ ఈ ఫుడ్ స్టోరీస్‌లో ఉంది. దీని విలువ ఏకంగా రూ.5 లక్షలు. మామూలు పుట్టగొడుగులు 100 గ్రాముల ధర రూ.175 నుంచి వెయ్యి రూపాయలపైనే ఉంటుంది.
Read Also:SLBC Tunnel: ముమ్మరంగా సహాయక చర్యలు.. రంగంలోకి ర్యాట్ హోల్ మైనర్స్
కూరగాయలను సైతం విదేశాలనుంచి తీసుకొస్తారు. మెక్సికో, స్పెయిన్, నెదర్లాండ్స్.. ఇలా ఎన్నో దేశాల నుంచి ఇక్కడకు దిగుమతి చేసుకుంటారు. ఉదాహరణకు నెదర్లాండ్స్ నుంచి తీసుకొచ్చిన టమాట ధర 200 గ్రాములు రూ.850లకు లభిస్తుంది. ఒక గ్లాస్ చెరకు రసం ధర రూ.275గా ఉంది. థాయ్‌లాండ్‌కు చెందిన కొబ్బరి బోండం ఒక్కొక్కటి కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే. ఈ ధరలు చూసిన నెటిజన్లు.. రానా, మిహికా పెట్టిన షాప్ కేవలం రిచ్ పీపుల్ కోసమేని, సామాన్యులు ఇక్కడ ఏదీ కొనే పరిస్థితి లేదని కామెంట్లు చేస్తున్నారు.