ఇటీవల సినీ పరిశ్రమలో పని గంటలు (వర్కింగ్ అవర్స్) అంశం పెద్ద చర్చకు దారితీసింది. ముఖ్యంగా దీపికా పదుకొణె ఇష్యూ తర్వాత ఇది మరింత హాట్ టాపిక్‌గా మారింది. చాలామంది సెలబ్రిటీలు దీనిపై మాట్లాడగా, తాజాగా నటుడు రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్ కూడా తమ అభిప్రాయాలు చెప్పారు. కొందరు ‘8 గంటలే పని చేయాలి’ అని అంటున్న దాన్ని ఉద్దేశిస్తూ రానా స్పందించారు. “సినిమా ఫీల్డ్ అనేది మిగతా రంగాల లాగా అస్సలు కాదు. నటన అనేది ఏదో ఉద్యోగం కాదు, ఇది ఒక జీవనశైలి (లైఫ్‌స్టైల్). దీన్ని ఫాలో అవ్వాలా వద్దా అనేది పూర్తిగా మన ఇష్టం. 8 గంటలు కూర్చుని చేస్తే అద్భుతమైన అవుట్‌పుట్ వచ్చే ప్రాజెక్ట్ లాంటిది యాక్టింగ్ కాదు’ అని రానా బలంగా చెప్పారు.
Also Read : Akhanda 2 : అఖండ 2: తాండవం – థియేట్రికల్ బుకింగ్స్ ఓపెన్!
రానా మాట్లాడుతూ.. ఒక మంచి సినిమా అవుట్‌పుట్ రావాలంటే, నటీనటులు సినిమాలోని ప్రతి విభాగంలోనూ పూర్తిగా ఇన్వాల్వ్ కావాలి, అంకితభావంతో పని చేయాలని అన్నారు. ‘అందరూ బాగా కష్టపడితేనే మంచి సీన్లు వస్తాయి. అందుకే, ఈ రంగంలో ‘ఇన్ని గంటలే పని చేయాలి’ అని రూల్స్ పెట్టడం లేదా లిమిట్ చేయడం చాలా కష్టం’ అని ఆయన స్పష్టం చేశారు. సింపుల్‌గా చెప్పాలంటే, నటన అనేది డ్యూటీ కాదు, అది మన జీవితంలో భాగం చేసుకోవాల్సిన ప్యాషన్ అని రానా అభిప్రాయపడ్డారు. అలాగే దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ..
‘ మళయాలం లో షూటింగ్ మొదలుపెడితే అది ఎప్పుడు పూర్తవుతుందో కూడా తెలియదు. ‘మహానటి’ చేస్తున్నప్పుడు కొన్నిసార్లు సాయంత్రం ఆరు గంటలకే ఇంటికి వెళ్ళే సౌలభ్యం ఉండేది. కానీ తమిళంలో పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంటుంది రెండు ఆదివారాలు కూడా సెలవు ఇస్తారు. అంతే కాదు ఒక రోజు మొత్తం అదనపు షూటింగ్ పెట్టడం కంటే, రోజూ కొన్ని గంటలు అదనంగా పనిచేయడం బెస్ట్’ అని దుల్కర్ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీని ద్వారా, పరిశ్రమను బట్టి పని విధానాలు, నిబంధనలు మారుతున్నాయని ఆయన స్పష్టం చేశారు.