Ayodhya Ram Mandir : అయోధ్యలో సోమవారం రామమందిర ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇందుకోసం దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలు ఈ వేడుకకు ఆహ్వానాలను అందించారు. ముఖేష్ అంబానీ, ఆయన తల్లి కోకిలాబెన్, భార్య నీతా, కుమారులు ఆకాష్, అనంత్, కోడలు శ్లోక, కాబోయే కోడలు రాధిక మర్చంట్ ప్రాణ ప్రతిష్ఠకు హాజరుకానున్నారు. వీరితో పాటు ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార్ మంగళం బిర్లా, అతని భార్య నీర్జా, పిరమల్ గ్రూప్ చైర్మన్ అజయ్ పిరమల్, మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థల చైర్మన్ ఆనంద్ మహీంధ్ర, టీసీఎస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కె కీర్తివాసన్ ఉన్నారు. డాక్టర్ రెడ్డిస్ ఫార్మాస్యూటికల్స్‌కు చెందిన కె సతీష్ రెడ్డి, జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ సీఈవో పునీత్ గోయెంకా, లార్సెన్ అండ్ టూబ్రో చైర్మన్, మేనేజింగ్ డైరక్టర్ ఎస్‌ఎన్ సుబ్రహ్మణియన్, ఆయన భార్య, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడడు ఎన్‌ఆర్ నారాయణమూర్తి, జిందాల్ స్టీల్ అండ్ పవర్ చీఫ్ నవీన్ జిందాల్, వేదాంత గ్రూప్‌కు చెందిన నరేష్ ట్రెహాన్‌కు రాములోరి ప్రాణ ప్రతిష్ఠకు రావాలంటూ ఆహ్వానాలు అందాయి.
Read Also:Ram Mandir : ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి దూరంగా ఎల్ కే అద్వానీ.. ఎందుకంటే?
అంతే కాకుండా, లోక్‌సభ మాజీ స్పీకర్ మీరా కుమార్, ప్రణాళికా సంఘం(రద్దు చేయబడింది) మాజీ డిప్యూటీ చైర్మన్ మాంటెక్ సింగ్ అహ్లూవాలియా జాబితాలో ఉన్నారు. మాజీ దౌత్యవేత్త అమర్ సిన్హా, మాజీ అటార్నీ జనరల్ కెకె, వేణుగోపాల్, ముకుల్ రోహిత్గీ, భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్‌కు ఆహ్వానాలు అందాయి.
Read Also:TSRTC: హైదరాబాద్ లో రెండు ఆర్టీసీ బస్సులు దగ్దం..