గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. త్రిపుల్ ఆర్ సినిమాతో వరల్డ్ పాపులర్ స్టార్ అయ్యాడు.. ప్రస్తుతం వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ బిజీగా ఉన్నాడు.. ప్రస్తుతం శంకర్ దర్శకత్వం గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్నాడు.. ఈ సినిమా చివరి షెడ్యూల్ షూటింగ్ లో బిజీగా ఉంది.. ఈ సినిమా ఇంకా అవ్వలేదు కానీ మరో సినిమాను చెర్రీ లైన్లో పెట్టాడు.. బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు.. ఆ సినిమాను ఇటీవలే కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు..
ఈ సినిమా జూన్ నుంచి రెగ్యూలర్ షూట్ ను జరుపుకోనుంది.. ఈ సినిమా ఇంకా సెట్స్ మీదకే వెళ్ళలేదు కానీ ఇప్పుడు క్యూలో మరో సినిమా వచ్చి చేరింది.. రంగస్థలం కాంబో రిపీట్ అయ్యింది.. రామ్ చరణ్ సుకుమార్ కాంబోలో వచ్చిన రంగస్థలం సీక్వెల్ గా ఈ సినిమా రాబోతుందని తెలుస్తుంది. ఈరోజు రామ్ చరణ్ పుట్టినరోజు సందర్బంగా మరికొన్ని సినిమాలను అనౌన్స్ చేయబోతున్నారని టాక్..
ఇప్పుడు కమిట్ అయిన సినిమాలు పూర్తి అవ్వడానికి ఏడాది పడుతుంది.. డిసెంబర్ నుంచి RC17 సెట్స్‌పైకి రానుంది. ఇప్పుడు ఒప్పుకున్న సినిమాలు అన్ని వచ్చే ఏడాదిలోనే విడుదల కాబోతున్నాయి.. అంటే వచ్చే ఏడాది రామ్ చరణ్ నుంచి మూడు సినిమాలు రాబోతున్నాయని తెలుస్తుంది.. మొత్తంగా చూసుకుంటే 2025 లో రామ్ చరణ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాడు..