Rakesh Master: ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ నిన్న ఆదివారం మృతి చెందిన విషయం తెల్సిందే. సన్ స్ట్రోక్ వలన రక్త విరోచనాలు కావడంతో ఆయనను గాంధీ ఆసుపత్రికి తరలించగా .. అక్కడ చికిత్స పొందుతూ రాకేష్ మాస్టర్ మృతి చెందిన విషయం తెల్సిందే. ఇక రాకేష్ మాస్టర్ మృతి పట్ల టాలీవుడ్ ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తోంది. అభిమానులతో పాటు.. సినీ ప్రముఖులు సైతం రాకేష్ మాస్టర్ భౌతికకాయానికి నివాళులు అర్పిస్తున్నారు. ఇక ఎప్పటినుంచో రాకేష్ మాస్టర్- శేఖర్ మాస్టర్ కు మధ్య విబేధాలు నెలకొన్న విషయం తెల్సిందే. శేఖర్ మాస్టర్ ను ఇండస్ట్రీకి పరిచయం చేసింది రాకేష్ మాస్టర్ అన్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. అతని దగ్గర శిష్యరికం చేసిన వాళ్ళు ఇప్పుడు చాలామంది స్టార్ కొరియోగ్రాఫర్స్ అయ్యారు. మొదట్లో శేఖర్- రాకేష్ చాలా సన్నిహితంగా మెలిగేవారు. గురుశిష్యులు ఇలా ఉండాలి అని అనిపించుకొనేవారు. అయితే సడెన్ గా రాకేష్ మాస్టర్.. శేఖర్ మాస్టర్ ను తిట్టడం మొదలుపెట్టాడు. నేను చచ్చాకా నా శవాన్ని కూడా శేఖర్ చూడడానికి వీల్లేదు అని చెప్పుకొచ్చాడు. అసలు వారిద్దరి మధ్య అంత గొడవ ఏం జరిగింది. రాకేష్ మాస్టర్ ను శేఖర్ మాస్టర్ ఎందుకు అవమానించాడు..? అని అంటే .. గతంలో రాకేష్ మాస్టర్ ఈ విధంగా చెప్పుకొచ్చాడు.
Mega Family: మెగా ఫాన్స్ కి పండగ లాంటి న్యూస్…వారసుడి రాకకు ముహూర్తం ఫిక్స్?
“శేఖర్ ను నేను కన్నబిడ్డ కంటే ఎక్కువ చూసుకున్నాను. అతని పెళ్లి కూడా నేనే దగ్గర ఉండి చేశాను. ఇక శేఖర్.. ఒక ఇంటర్వ్యూలో నన్ను అవమానించాడు. తన గురువు ఎవరు అంటే.. ప్రభుదేవా అని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా తన బిడ్డ పుట్టినరోజుకు కూడా నన్ను పిలవలేదు” అని చెప్పుకొచ్చారు. ఇక ఇదొక్కటే కారణం కాదని, శేఖర్ మాస్టర్ .. రాకేష్ మాస్టర్ కు తెలియకుండా చాలా సాంగ్స్ కు కొరియోగ్రఫీ చేశాడని, దానివల్ల కూడా ఆయనకు శేఖర్ పై కోపం ఉండొచ్చని అందువలనే.. తన శవాన్ని కూడా తాకొద్దని రాకేష్ మాస్టర్ చెప్పినట్లు తెలుస్తోంది. ఇక ఈ విబేధాలపై శేఖర్ మాస్టర్ కూడా క్లారిటీ ఇచ్చాడు. అసలు రాకేష్ మాస్టర్ కు తానేం చేసానో తెలియదు అని, ఆయన అలా నాపై నిందలు వేస్తుంటే చాలా బాధగా ఉండేదని చెప్పుకొచ్చాడు. ఏదిఏమైనా శేఖర్ మాత్రం.. తన గురువుకు నివాళులు అర్పించడానికి వెళ్లి నిజమైన శిష్యుడు అనిపించుకున్నాడు.