టాలివుడ్ ఇండస్ట్రీలో హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్న హీరోలలో అక్కినేని నాగార్జున కూడా ఒకరు.. గతంలో వరుసగా హిట్లను సొంతం చేసుకున్న ఆయన.. ఈ మధ్య కాలంలో మాత్రం అంతగా రాణించడం లేదు. అయినా ప్రయత్నాలను మాత్రం ఆపడం లేదు.. బంగార్రాజు సినిమా తన ఖాతాలో ఒక్క హిట్ కూడా పడలేదు.. ఇప్పుడు సరికొత్త కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు..
నాగార్జున నటిస్తోన్న తాజా చిత్రమే ‘నా సామిరంగ’. ఫేమస్ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకుడిగా చేస్తున్న ఈ మూవీ ఫ్యామిలీ అండ్ మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. దీంతో దీనిపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. మొన్న రిలీజ్ అయిన టీజర్ అంచనాలను పెంచేసింది.. ఇప్పుడు మరో అప్డేట్ ను వదిలారు మేకర్స్..
తాజాగా ఈ సినిమా నుంచి దుమ్ము దుకాణం అనే మాస్ సాంగ్ ప్రోమో విడుదల చేశారు.. ఆ రిలీజ్ అయిన కొద్ది నిమిషాల్లోనే ట్రెండ్ అవుతుంది.. ఈ సాంగ్ ఖచ్చితంగా దుమ్ము దులిపేస్తుందని నాగ్ అభిమానులు అభిప్రాయ పడుతున్నారు…ఫుల్ లెంగ్త్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ‘నా సామిరంగ’ మూవీ షూటింగ్ ఈ మధ్యనే పూర్తి అయింది. అప్పటి నుంచి ఏమాత్రం బ్రేకులు లేకుండా వరుస షెడ్యూళ్లను కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నారు.
ముందుగా అనుకున్నట్టు g’నా సామిరంగ’ మూవీని జనవరి 14వ తేదీన విడుదల చేయబోతున్నారు. దీనిపై ఈ రెండు మూడు రోజుల్లోనే అధికారిక ప్రకటన వస్తుందని తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. గతంలో ‘బంగార్రాజు’ జనవరి 14న వచ్చి హిట్ అయింది. అలాగే, ‘సోగ్గాడే చిన్ని నాయన’ జనవరి 15వ వచ్చి సక్సెస్ అయింది. ఈ సెంటిమెంట్ ప్రకారం ఇది కూడా హిట్టే నాగార్జున అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.. నా సామిరంగ’ మూవీని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. ఇందులో అషికా రంగనాథ్ హీరోయిన్‌గా.. అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.. కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు..