కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో విభేదాలు రచ్చకెక్కాయి. ఇప్పటికే సిద్ధరామయ్య- డీకే.శివకుమార్ వర్గాలు రెండుగా విడిపోయాయి. ముఖ్యమంత్రి మార్పును శివకుమార్ వర్గీయులు కోరుకుంటుంటే.. అందుకు సిద్ధరామయ్య ససేమిరా అంటుకున్నారు. సీటులోంచి దిగే ప్రసక్తేలేదని తేల్చి చెబుతున్నారు. ఈ పంచాయితీ ఇలా ఉంటుండగా తాజాగా కొత్త పంచాయితీ రచ్చ చేస్తోంది.
కన్నడ నటి రన్యారావు బంగారం స్మగ్లింగ్ కేసు వ్యవహారం కర్ణాటక ప్రభుత్వానికి చుట్టుకుంటోంది. కేబినెట్‌లో కీలక నేత, హోంమంత్రి పరమేశ్వర సంస్థలపై బుధవారం నుంచి ఈడీ దాడులు చేస్తోంది. అలాగే మంత్రిని కూడా ప్రశ్నించారు.
భారత్-పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తల మధ్య కర్ణాటక మంత్రి బీజడ్ జమీర్ అహ్మద్‌ఖాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా అనుమతిస్తే.. పాక్‌లో ఆత్మాహుతి దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు.
Karnataka Minister: పహల్గామ్ ఉగ్రవాదుల దాడిలో అమాయకపు టూరిస్టులు 26 మంది మరణించారని యావత్ దేశం తీవ్ర బాధలో ఉంది. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా అనుంబంధ టీఆర్ఎఫ్ ఈ దాడికి పాల్పడినట్లు ప్రకటించింది. ఈ దాడికి పాకిస్తాన్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారు. ముఖ్యంగా, హిందువుల్ని టార్గెట్ చేస్తూ ముష్కరులు టార్గెట్ చేయడాన్ని భారత సమాజం తీవ్రంగా ఖండిస్తోంది. ఇదిలా ఉంటే, కొందరు కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు మాత్రం వివాదాస్పదమవుతున్నాయి. ఇప్పటికే,…
రామ మందిర ఘనత భారతీయ జనతా పార్టీదేనని కర్ణాటక మంత్రి రామలింగారెడ్డి ఎద్దేవా చేశారు. బీజేపీని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. 'రాజీవ్‌గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు రామమందిరం తాళం తెరిచేందుకు చర్యలు తీసుకున్నారు అనే విషయాన్ని గుర్తు చేశారు.
2వ శతాబ్దపు సంఘ సంస్కర్త బసవేశ్వర (బసవన్న) పేరు మీదుగా విజయపుర జిల్లా పేరును మార్చాలని డిమాండ్‌లు ఉన్నాయని కర్ణాటక మంత్రి ఎంబీ పాటిల్ శుక్రవారం అన్నారు. కర్ణాటక రాష్ట్రం మొత్తాన్ని 'బసవ నాడు' (బసవ భూమి)గా మార్చడంలో తప్పు లేదని ఆయన వ్యాఖ్యానించారు.
Karnataka: కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న డి.సుధాకర్‌పై పోలీస్ కేసు నమోదైంది. ఓ ఆస్తి వివాదం కేసులో మంత్రి దళిత కుటుంబంపై దాడి చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ వివాదంపై మంత్రిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
నేటి కాలంలో అవినీతి రహిత జీవితాన్ని గడపడం చాలా కష్టమైన పని అని... ఎందుకంటే రాజకీయ నాయకులు అవినీతికి పాల్పడాలని డిమాండ్ చేస్తున్నారని కర్ణాటక న్యాయ, అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి జేసీ మధుస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు.
కర్నాటకలో ఎప్పుడూ హాట్ హాట్ రాజకీయాలు నడుస్తుంటాయి. తాజాగా మంత్రి కేఎస్ ఈశ్వరప్పకు బీజేపీ షాకిచ్చింది. అత్యంత వివాదాస్పదుడిగా, అవినీతిపరుడిగానూ పేరుపొందిన బీజేపీ మంత్రి ఈశ్వరప్పపై బీజేపీ వేటేసింది. మంత్రిగా ఉండి మతఘర్షణలకు ఊతమిస్తున్నారనే విమర్శలకు తోడు సామాన్యులను బెదిరించి, వారి మరణాలకూ కారకుడవుతున్నారని ఈశ్వరప్పపై అనేక ఆరోపణలున్నాయి. తాజాగా సంతోష్ పాటిల్ అనే గవర్నమెంట్ రోడ్డు కాంట్రాక్టర్ ఆత్మహత్య ఉదంతం దేశాన్ని కుదిపేసింది. దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిన ఈ వివాదంపై సీఎం స్పందించారు. దీనిపై వస్తున్న…