Manchu Vishnu: మంచు విష్ణు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం కన్నప్ప. ఇప్పటికే అనేక సార్లు వాయిదా పడిన ఈ చిత్రం ఈసారి జూన్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. హిందీలో రామాయణం లాంటి సీరియల్ చేసిన ముఖేష్ సింగ్ ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు. మంచు మోహన్ బాబు నిర్మాతగా వ్యవహరిస్తూనే ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపించారు.
Read Also: The Rajasaab : ఇద్దరు హీరోయిన్లు కావాలన్న ప్రభాస్.. ముగ్గురిని దించిన మారుతి..
నిజానికి, ఈ సినిమా మొదలైనప్పటి నుంచి సినిమాపై ఎన్నో ట్రోలింగ్లు వచ్చాయి. మంచు విష్ణుపై, సినిమా కంటెంట్‌పై ఎన్నో ట్రోలింగ్లు వస్తున్న క్రమంలో, ట్రైలర్ మాత్రం సినిమాపై కాస్త పాజిటివ్ వైబ్‌ను తీసుకొచ్చింది. అయితే, తాజాగా ఈ సినిమాను రజనీకాంత్‌కు చూపించినట్లు మంచు విష్ణు వెల్లడించాడు. సినిమా చూసిన అనంతరం రజనీకాంత్ ఒక గట్టి హగ్ ఇచ్చారని ఆయన వెల్లడించాడు.
Read Also: The Raja Saab: రాజా సాబ్ హవేలీ సెట్ ఎంత భయంకరంగా ఉందో చూసారా..?
“ఒక నటుడిగా నేను 22 సంవత్సరాలుగా ఆ హగ్ కోసం ఎదురు చూస్తున్నాను. #కన్నప్ప జూన్ 27న వస్తోంది, ప్రపంచం శివుని మాయాజాలాన్ని అనుభవించడానికి నేను వేచి ఉండలేను” అని మంచు విష్ణు చెప్పుకొచ్చారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన మరో ఈవెంట్ రాజస్థాన్‌లో జరగబోతున్నట్లు తాజాగా మేకర్స్ ప్రకటించారు. మొత్తం మీద ప్రభాస్, మోహన్‌లాల్, అక్షయ్ కుమార్ వంటి స్టార్లు ఈ సినిమాలో భాగమవడంతో సినిమాపై అంచనాలు ఇప్పుడు నెమ్మదిగా పెరుగుతున్నాయి.
Last night, @rajinikanth uncle watched #Kannappa. After the film, he gave me a tight hug. He told me that he loved #Kannappa.
I’ve been waiting 22 years as an actor for that hug!!!
Today, I feel encouraged. Humbled. Grateful. #Kannappa is coming on 27th June and I can’t wait… pic.twitter.com/HDYlLuDsdc
— Vishnu Manchu (@iVishnuManchu) June 16, 2025