వరుస సినిమాలతో ఫుల్ స్వింగ్ లో దూసుకుపోతున్నారు ప్రభాస్. 

ప్రస్తుతం మారుతితో రాజా సాబ్‌.. హను రాఘవపూడి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు.

తాజాగా రాజాసాబ్ టీజ‌ర్ వచ్చేసింది. ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కు బాగా క‌నెక్ట్ అయ్యింది. 

ఈ టీజ‌ర్ తో ఈ సినిమాపై న‌మ్మ‌కాలు, అంచ‌నాలు రెట్టింపు అయ్యాయి. 

రాజాసాబ్ చిత్రంలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్‌ హీరోయిన్లుగా నటిస్తుండగా.. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది.

టీజర్‌లో వింటేజ్ లుక్ ప్రభాస్, స్టైలిష్ యాక్షన్, పంచ్ డైలాగ్స్, కామెడీ ట్రాక్, రొమాన్స్ అన్నీ ఫ్యాన్స్‌కి ట్రీట్‌లా ఉన్నాయి.

ఈ సినిమా నిడివి ప‌రంగా రాజాసాబ్ పెద్ద‌దే. పార్ట్ 2 కూడా ఉంటుందని నిర్మాత తెలిపారు.

పార్ట్ 2 హాలీవుడ్ రేంజ్‌లో తీస్తామ‌ని ఇప్ప‌టికే నిర్మాత విశ్వ ప్ర‌సాద్ ప్ర‌క‌టించేశారు.

డిసెంబ‌రు 5న రాజాసాబ్ రిలీజ్ కానున్న సంగ‌తి తెలిసిందే.

తాజాగా రాజా సాబ్ హవేలీ సెట్ అజీజ్ నగర్ సంబంధించి ఫోటోలు బయటికి వచ్చాయి.

ఈ సెట్ 9 కోట్ల బడ్జెట్.. ఇది ఇండోర్ సెట్..

ఈ సెట్ ఎక్సటెరియర్ అల్యూమినియం ఫ్యాక్టరీలో వేశారు.

భారతదేశంలో అతిపెద్ద ఇండోర్ సెట్ గా 41,256 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు.

సినిమాలో ఎక్కువ భాగం ఈ సెట్ లోనే షూట్ చేశారు.

రిలీజ్ కు ముందే మీడియాకి చూపించడం గమనార్హం.