రెబల్ స్టార్ ప్రభాస్, టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి, టాలీవుడ్ బడా ప్రొడక్షన్ హౌస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కాంబినేషన్ లో రూపొందుతున్న క్రేజీ మూవీ “రాజా సాబ్” . వచ్చే సంక్రాంతికి జనవరి 9న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సినిమా విడుదల తేదీ మరోసారి వాయిదా పడిందంటూ ఇటీవల సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ ప్రచారమవుతోంది. ఈ అసత్య ప్రచారనికి చెక్ పెట్టారు మూవీ టీమ్. అనుకున్న ప్రకారమే జనవరి 9న “రాజా సాబ్” సినిమా ఘనంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని వెల్లడించారు.
Also Read : OTT : తెలుసు కదా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేసిన నెట్ ఫ్లిక్స్
ప్రస్తుతం “రాజా సాబ్” సినిమాకు సంబంధించిన వీఎఫ్ఎక్స్, ఇతర పోస్ట్ ప్రొడక్షన్ పనులు పుల్ స్వింగ్ లో జరుగుతున్నాయి. జనవరి 9న అన్ని భాషల్లో విడుదల చేసేందుకు రిలీజ్ సన్నాహాలు కూడా చేస్తున్నారు. ఐమ్యాక్స్ వెర్షన్ సహా అన్ని లార్జర్ ఫార్మేట్స్ లో “రాజా సాబ్” ప్రేక్షకుల ముందుకు రానుంది. డిసెంబర్ లో యూఎస్ లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరపనున్నారు. డిసెంబర్ 25వ తేదీ లోగా ఫస్ట్ కాపీ రెడీ చేయబోతున్నారు. ఇలా అన్ని హంగులతో సంక్రాంతి సందడి రెట్టింపు చేసేందుకు “రాజా సాబ్” థియేటర్స్ లో అడుగుపెట్టేందుకు సన్నద్ధమవుతున్నాడు. టాలీవుడ్ నుంచి వస్తున్న మరో ప్రెస్టీజియస్ మూవీగా “రాజా సాబ్” ను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు మారుతి. ఈ సినిమాను భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో అన్ కాంప్రమైజ్డ్ గా నిర్మిస్తున్నారు నిర్మాత టీజీ విశ్వప్రసాద్. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ ఈ చిత్రంలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు