స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించిన తాజా చిత్రం ‘తెలుసు కదా’. కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేసిన నీరజ కోన ఈ సినిమాతో దర్శకురాలిగా టాలీవుడ్ లో అరంగేట్రం చేసింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి, రాశి కన్నా కథానాయికలుగా నటించారు. వైవా హర్ష కీలక పాత్ర పోషించిన ఈ సినిమా దీపావళి కానుకగా అక్టోబరు 17న వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో రిలీజ్ అయింది తెలుసు కదా.
Also Read : Tollywood Stars : మొన్నJr. NTR.. నిన్నరామ్ చరణ్.. నేడు రామ్ పోతినేని
కానీ ఫస్ట్ డే ఫస్ట్ షో నుండే ఈ సినిమాకు ఆడియెన్స్ నుండి మిక్డ్స్ టాక్ వచ్చింది. కథ బాగున్నప్పటికీ కథనం బాలేదని టాక్ తెచుకుంది. అలా థియేటర్స్ లో ప్లాప్ గా మిగిలింది తెలుసు కదా. కాగా ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఈ సినిమాకు డిజిటల్ రైట్స్ ను రిలీజ్ కు ముందు. ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ సంస్థ రూ. 22 కోట్లకు కొనుగోలు చేసింది. థియేటర్ లో ఊహించని విజయం సాధించని తెలుసు కదా ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అయింది. ఈ నెల 14 నుండి అన్ని సౌత్ ఇండియా బాషలలో స్ట్రీమింగ్ కి తీసుకువస్తుంది నెట్ ఫ్లిక్స్. థియేటర్స్ లో రిలీజ్ అయిన 28 రోజుల తర్వాత ఓటీటీ స్ట్రీమింగ్ కు తీసుకువస్తుంది నెట్ ఫ్లిక్స్. కొన్ని సినిమాలు థియేటర్స్ లో మెప్పించకున్న కూడా ఓటీటీలో మంచి వ్యూస్ రాబడతాయి. ఇప్పుడు ఆ లిస్ట్ లోకి తెలుసు కదా కూడా చేరుతుందేమో చూడాలి.