గంగానది పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్‌కు ఆనుకుని ఉన్న లోతైన అల్పపీడనం పశ్చిమ-వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉంది. దీని వలన భారతదేశంలోని ఐదు రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. సెప్టెంబరు 14, 15వ తేదీల్లో జార్ఖండ్‌లో.. సెప్టెంబరు 15న ఛత్తీస్‌గఢ్‌లో.. సెప్టెంబర్ 16న తూర్పు మధ్యప్రదేశ్‌లో, గంగానది పశ్చిమ బెంగాల్, ఒడిశా మైదానాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది.
అలాగే.. పశ్చిమ మరియు మధ్య భారత రాష్ట్రాలైన కొంకణ్, గోవా, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, విదర్భ, మధ్య మహారాష్ట్ర, మరఠ్వాడా మరియు గుజరాత్‌లలో వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. సెప్టెంబర్ 15న ఛత్తీస్‌గఢ్‌లో, 16న తూర్పు మధ్యప్రదేశ్‌లో అతి భారీ వర్షాలు కురుస్తాయని.. సెప్టెంబర్ 14న ఛత్తీస్‌గఢ్‌లో, సెప్టెంబరు 15-17 మధ్య తూర్పు మధ్యప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
Read Also: Crime: వేధింపుల కేసు పెట్టేందుకు వెళ్లిన మహిళపై వ్యభిచారం కేసు!
తూర్పు మరియు ఈశాన్య భారతదేశంలోని రాష్ట్రాలైన.. సెప్టెంబర్ 14న గంగా నది పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశాలో.. జార్ఖండ్‌లో సెప్టెంబర్ 14 మరియు 15 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. సెప్టెంబరు 14, 15 తేదీల్లో బీహార్, ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. సెప్టెంబర్ 14 అరుణాచల్ ప్రదేశ్, సబ్ హిమాలయన్ పశ్చిమ బెంగాల్, సిక్కిం.. సెప్టెంబరు 15 గంగా పశ్చిమ బెంగాల్, సెప్టెంబర్ 14-16 బీహార్, జార్ఖండ్, ఒడిశా, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలలో.. సెప్టెంబర్ 14 అస్సాం, మేఘాలయలో అనంతరం.. 18-20 మధ్యలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
సెప్టెంబర్ 14 ఉత్తరాఖండ్‌లో.. సెప్టెంబర్ 16, 17 తూర్పు ఉత్తరప్రదేశ్‌లో.. సెప్టెంబర్ 17న పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాయువ్య భారత వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ భారతదేశంలోని కర్ణాటక, కేరళ, మహే, లక్షద్వీప్‌లలో ఈ వారం వరకు వర్షాలు పడుతాయని పేర్కొంది.
Read Also: Champions Trophy: ‘భారత్ పాకిస్థాన్ రాకపోతే..’ బీసీసీఐని హెచ్చరించిన పాక్ మాజీ కెప్టెన్