ఇప్పటికే రాష్ట్రంలో లోటు వర్షపాతం నమోదయ్యింది. గత సంవత్సరం తో పోలిస్తే ఈ సంవత్సరం రుతుపవనాలు రాష్ట్రంలోకి ఆలస్యంగా ప్రవేశించిన విషయం తెలిసిందే. దీనికి తగ్గట్టుగానే రాష్ట్రంలో ఇప్పటికి 30-40 శాతం లోటు వర్షపాతం నమోదయ్యింది. రైతులు వర్షాలకు ఎదురుచూస్తున్న క్రమంలో వాతావరణ శాఖ చల్లటి కబురు అందించింది. బంగాళాఖాతంలోఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాగల 72గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ వానలు కురిసే అవకాశం ఉందని వాతారణ శాఖ ప్రకటించింది. దీంతో.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
Also Read : Vandebharat: టాయిలెట్ వస్తుందని వందేభారత్ ఎక్కాడు.. టిటి వచ్చి రూ.1000ఫైన్ వేశాడు
తెలంగాణలో వచ్చే మూడు రోజుల కుండపోత వానలు ఉండనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. మహబూబాబాద్, సూర్యాపేట, వరంగల్, హనుమకొండ, భద్రాద్రి, ఖమ్మం, జనగామ, యాదాద్రిలో అతిభారీ వర్షాలు. భూపాలపల్లి, సంగారెడ్డి, మెదక్, మేడ్చల్.. రంగారెడ్డి, హైదరాబాద్, వికారాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. తెలంగాణతో పాటు.. ఏపీలో వచ్చే మూడు రోజులు జోరువానలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అల్లూరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు. పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.
Also Read : Army Officer: అగ్ని ప్రమాదంలో ఆర్మీ ఆఫీసర్ మృతి.. మరో ముగ్గురికి గాయాలు