Army officer: బుధవారం తెల్లవారుజామున సియాచిన్ హిమానీనదంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఒక ఆర్మీ అధికారి మరణించగా, మరో ముగ్గురు సైనికులు గాయపడినట్లు అధికారులు తెలిపారు. గాయపడిన సైనికులను సురక్షితంగా ఆసుపత్రికి తరలించినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు వైద్యులు ప్రకటించారు. ఈ ఘటన బుధవారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో సియాచిన్ గ్లేసియర్ వద్ద ఈ ఘటన జరిగినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. క్షతగాత్రులను సురక్షితంగా ఆస్పత్రికి తరలించినట్లు డిఫెన్స్ పీఆర్వో లెహ్ లెఫ్టినెంట్ కల్నల్ పీఎస్ సిద్ధూ తెలిపారు.
Read also: Urusa Javed: ఏం ఉర్ఫీ నువ్వే అనుకుంటే.. నీ చెల్లి నిన్ను మించి చూపిస్తుందిగా..
ఆర్మీ యొక్క రెజిమెంటల్ మెడికల్ ఆఫీసర్, కెప్టెన్ అన్షుమాన్ సింగ్ తీవ్రమైన కాలిన గాయాలతో మరణించినట్టు అధికారులు తెలిపారు. మరో ముగ్గురు సైనికులు కాలిన గాయాలకు గురయ్యారని అధికారులు తెలిపారు. క్షతగాత్రులను తదుపరి చికిత్స కోసం సురక్షితంగా హాస్పిటల్‌కి తరలించామని, వారి పరిస్థితి నిలకడగా ఉందని వారు తెలిపారు.
In the face of tragedy, I pay tribute to Capt Anshuman, a courageous hero who gave his life protecting his soldiers in the Siachen fire incident. His selflessness and valor will be eternally cherished. My heartfelt condolences to his loved ones. May Capt Anshuman rest in peace. pic.twitter.com/DBigHrDhny
— Jamyang Tsering Namgyal (@jtnladakh) July 19, 2023