కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ సహా విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై లోక్ సభలో రెండో రోజు చర్చ జరుగుతుంది. మణిపూర్ హింసతో పాటు పలు అంశాలపై తీర్మానంపై చర్చ సందర్భంగా విపక్ష సభ్యులు కేంద్రాన్ని నిలదీయనున్నారు. అవిశ్వాస తీర్మానంపై కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్, స్మృతి ఇరానీతో పాటు పలువురు మాట్లాడనున్నారు.
Read Also: MLA Kasu Mahesh Reddy: లోకేష్‌పై ఎమ్మెల్యే మహేశ్ రెడ్డి ఫైర్.. అందుకే ఆయన్ను ‘సారా’ లోకేష్ అంటారు
అయితే, నిన్న (మంగళవారం) అవిశ్వాస తీర్మానంపై రాహుల్ గాంధీ ఎందుకు చర్చను ప్రారంభించలేదు అనే చర్చ కొనసాగుతుంది. అయితే, కాంగ్రెస్ తరపున మాట్లాడేవారి జాబితాలో తొలుత రాహుల్ గాంధీ పేరును చేర్చారు. కానీ, చివరి క్షణంలో దాన్ని తొలగించారు.. రాహుల్ గాంధీ చర్చను ఆరంభించకపోవడానికి ప్రధానంగా పలు కారణాలు వినిపిస్తున్నాయి. చర్చను ఈశాన్య ప్రాంతానికి చెందిన ఎంపీ గౌరవ్ గొగొయ్ ప్రారంభించడం మొదటిది.. మణిపూర్ హింసపై ఆయన మాట్లాడితే ప్రాధాన్యత కలిగి ఉంటుందని కాంగ్రెస్ అనుకుంది.
Read Also: Pawan Mahesh: బీడి, కర్ర ఒక్కటే తేడా… మిగతాదంతా సేమ్ టు సేమ్!
ఇక, అనర్హత వేటు తర్వాత ఎంపీగా లోక్ సభలోకి వచ్చిన వెంటనే రాహుల్ అవిశ్వాసంపై మాట్లాడితే వారసత్వ రాజకీయాలను ఉద్ధేశిస్తూ అధికార బీజేపీ విమర్శలకు దిగుతుందని భావించిన హస్తం నేతలు రాహుల్ ను పక్కన బెట్టినట్లు తెలుస్తోంది. ఇక మరో కారణం ప్రధాని మోడీ నిన్న సభలో లేకపోవడం.. రేపు(గురువారం) లోక్‌సభలో మోడీ ఉండటంతో అప్పుడు మాట్లాడే ఛాన్స్ ఉంది.
Read Also: Suryakumar Yadav: ఆ విషయం చెప్పేందుకు సిగ్గుపడాల్సిన అవసరం లేదు: సూర్యకుమార్
కాగా.. తొలిరోజు అవిశ్వాసంపై చర్చ సందర్భంగా అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది. చర్చ వాడీవేడిగా కొనసాగింది. మణిపూర్ హింసపై ప్రధాని నరేంద్ర మోడీ మౌనవ్రతం వీడి, ప్రకటన చేయడానికే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టామని ప్రతిపక్షాలు క్లియర్ గా చెప్పాయి. మరోవైపు ప్రజల సంక్షేమం కోసం కష్టపడి పనిచేస్తున్న మోడీపై విశ్వాసం లేదంటూ సభలో ఓటు వేస్తారా? అని అధికార బీజేపీ సభ్యులు ప్రతిపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేసింది.