ఏంది అట్టా చూస్తున్నావ్.. బీడి త్రీడిలో కనిపడుతుందా? అంటూ, గుంటూరు కారం టీజర్‌తో రచ్చ చేశాడు మహేష్ బాబు. నోట్లో బీడి, ఆ హెడ్ బ్యాండ్, మహేష్ మాస్ స్టైల్ ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్ ఇచ్చాయి. అతడు, ఖలేజా తర్వాత మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న ‘గుంటూరు కారం’ పై భారీ అంచనాలున్నాయి. కానీ అప్డేట్స్ విషయంలో ఫ్యాన్స్ ఎక్స్‌పెక్టేషన్స్‌ను రీచ్ అవలేకపోతున్నారు మేకర్స్. ఆగష్టు 9న మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా జస్ట్ ఒక ఊర మాస్ పోస్టర్‌తోనే సరిపెట్టారు మేకర్స్. ఇందులో లుంగీతో ఓ చోట కూర్చొని… నోట్లో బీడి వెలిగిస్తూ… కూలింగ్ గ్లాస్‌తో విలన్లను కుమ్మేయడానికి రెడీ అవుతున్నట్టుగా ఊరమాస్‌గా ఉన్నాడు మహేష్. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. కానీ దీని పక్కనే మరో పోస్టర్ కూడా ట్రెండ్ అవుతోంది. అదే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ పోస్టర్.
భీమ్లా నాయక్ పోస్టర్‌లో లుంగీతో కర్ర పట్టుకొని ఉన్న పవన్ పోస్టర్, గుంటూరు కారం లేటెస్ట్ పోస్టర్ సేమ్ టు సేమ్ ఉన్నాయి. కాకపోతే.. మహేష్ చేతిలో బీడి, పవన్ చేతిలో కర్ర, ఆ బ్యాక్ గ్రౌండ్ ఒక్కటే తేడాగా ఉంది. దీంతో త్రివిక్రమ్ గుంటూరు కారంలో భీమ్లా నాయక్ రేంజ్ మాస్ ట్రీట్ ఇస్తున్నట్టే కనిపిస్తోంది వ్యవహారం. భీమ్లా నాయక్ సినిమాకు డైరెక్టర్ సాగరే అయినప్పటికీ… వెనకాలా అన్నీ తానై నడిపించాడు త్రివిక్రమ్. స్క్రీన్ ప్లే, డైలాగ్స్ కూడా అందించాడు. ఈ సినిమా కమర్షియల్‌గా పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చింది. ఇక ఇప్పుడు గుంటూరు కారం సినిమాలోనూ మహేష్ బాబును పవన్‌లానే ప్రజెంట్ చేస్తున్నాడు త్రివిక్రమ్. దీంతో మహేష్, పవన్ మ్యూచువల్స్ ఫ్యాన్స్ ఇప్పుడు ఈ పోస్టర్స్‌ను ట్రెండ్ చేస్తున్నారు. మరి మహేష్ లుంగీలో చేసే రచ్చ ఎలా ఉంటుందో చూడాలి.