మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవిపై ఇంకా ఉత్కంఠ వీడలేదు. ఇంకా సస్పెన్ష్ కొనసాగుతోంది. ఈ ఉత్కంఠ మరిన్ని రోజులు కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా స్వయంగా రంగంలోకి దిగి చర్చలు జరిపినా సమస్య మాత్రం కొలిక్కి రాలేదు. ఎటు తెగని పంచాయితీగా మారిపోయింది.
కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ సహా విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై లోక్ సభలో రెండో రోజు చర్చ జరుగుతుంది. మణిపూర్ హింసతో పాటు పలు అంశాలపై తీర్మానంపై చర్చ సందర్భంగా విపక్ష సభ్యులు కేంద్రాన్ని నిలదీయనున్నారు.
కోనసీమలో క్రాప్ హాలీడేపై అధికారులు క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు. దాంతో రైతులు అయోమయానికి గురి అవుతున్నారు. గత ఏడాది ఇచ్చినట్లే హామీలు ఇచ్చి అమలు చేయకపోతే వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని రైతులు చెబుతున్నారు. దాంతో కోనసీమలో సాగుపై సస్పెన్స్ కొనసాగుతోంది. కోనసీమ జిల్లాలో దాదాపు 12 మండలాల్లో రైతులు ఈ ఏడాది సాగు చేయలేమని చేతులెత్తేస్తున్నారు. గ్రామాల్లో ఏకగ్రీవ తీర్మానాలు చేస్తూ అధికారులకు వినతిపత్రాలు ఇస్తున్నారు. జిల్లాలో ప్రధానంగా డ్రైన్లు సమస్యతో రైతులు అవస్థలు పడుతున్నారు. ఖరీఫ్…