బీఎస్పీ నేత డానిష్ అలీపై బీజేపీ ఎంపీ రమేష్ బిధూరి చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై గందరగోళం ఇంకా కొనసాగుతోంది. ఈ విషయంలో రాహుల్ గాంధీ చేసిన ప్రకటనపై అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ ఎదురుదాడి చేశారు. హిమంత బిస్వా శర్మ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. భారతదేశంలో ప్రేమ మాత్రమే ఉంది, ద్వేషం లేదు, ప్రేమ దుకాణం వంటి పదాలు తమ నిఘంటువులో లేవన్నారు. ఈ ప్రేమ దుకాణం ఓట్ల కోసం మాత్రమేనని విమర్శించారు.
లోక్‌సభ ప్రత్యేక సమావేశాల చివరి రోజున బీఎస్పీ ఎంపీ డానిష్ అలీపై బీజేపీ ఎంపీ రమేశ్ బిధూరి కించపరిచే పదజాలం వాడిన అంశం ఊపందుకుంది. ఈ విషయంపై రాజకీయ ఉత్కంఠ మధ్య కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ శుక్రవారం బీఎస్పీ ఎంపీ డానిష్ అలీని కలిశారు. డానిష్ అలీ ఇంటికి చేరుకున్న రాహుల్ గాంధీ.. అతన్ని కౌగిలించుకుని చాలాసేపు మాట్లాడారు. ఈ సమావేశానికి సంబంధించిన ఫోటోను రాహుల్ గాంధీ ఎక్స్‌లో పంచుకున్నారు.
Danish Ali: పార్లమెంట్ లో గురువారం చంద్రయాన్-3 చర్చ సందర్భంగా బీజేపీ ఎంపీ రమేష్ బిధూరి, బీఎస్పీ ఎంపీ డానిష్ అలీపై చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. రమేష్ బిధూరిని అరెస్ట్ చేయాలని ప్రతిపక్ష కాంగ్రెస్, ఆప్, టీఎంసీ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ వ్యాఖ్యలపై స్పీకర్ ఓం బిర్లా కూడా సీరియన్ అయ్యారు. మరోసారి ఇవి రిపీట్ అయితే చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. మరోవైపు ఈ వ్యాఖ్యలపై రమేష్ బిధూరికి బీజేపీ పార్టీ…
Ramesh Bidhuri: బీజేపీ ఎంపీ రమేష్ బిధూరి పార్లమెంట్ లో చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి. తన తోటి సభ్యుడు, బీఎస్పీ పార్టీకి చెందిన ముస్లిం ఎంపీ డానిష్ అలీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు. లోక్‌సభలో గురువారం చంద్రయాన్-3 మిషన్ పై చర్చ సందర్భంగా బిధూరి ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే బిధూరి వ్యాఖ్యలపై స్పీకర్ ఓం బిర్లా తీవ్రం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు మళ్లీ పునారవృతమైతే చర్యలు తీసుకుంటానని వార్నింగ్ ఇచ్చారు.
MP Ramesh Bidhuri: రాజ్యసభలో గురువారం మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ జరుగుతుండగా.. లోక్‌సభలో చంద్రయాన్-3 విజయంపై చర్చ కొనసాగుతోంది. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎంపీ రమేష్ బిధూరి బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) ఎంపీ డానిష్ అలీపై అభ్యంతరకర ప్రకటన చేశారు.