పార్లమెంట్ దగ్గర ప్రధాని నడుస్తుండగా ఆయన వెనక ఓ మహిళా భద్రతా సిబ్బంది కనపడ్డారు. ఈ పిక్ కంగన తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది. దీంతో ఈ ఫొటో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు రెండు పతకాలను సాధించి చరిత్ర సృష్టించిన షూటర్ మను భాకర్.. క్రీడల్లో ఉండే చిన్న చిన్న నైపుణ్యాలను నేర్చుకుంటుంది. ఇటీవలే ఆమె గుర్రపు స్వారీ, భరతనాట్యం.. స్కేటింగ్ నేర్చుకోవాలని తన కోరికను వ్యక్తం చేసింది. తాజాగా.. ఆమె క్రికెట్ నేర్చుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలో.. ఆదివారం భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌తో కలిసి ఉన్న చిత్రాన్ని మను భాకర్ పంచుకుంది.
దమ్మాయిగూడ బాలాజీనగర్‌కాలనీకి చెందిన రాంచంద్రయ్య వల్లెపు డీఎస్సీ రాస్తున్నాడు. ఇక హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకోగా వివరాలు సక్రమంగానే ఉన్నా ఫొటో, సంతకం మాత్రం అమ్మాయిది రావడంతో కంగుతిన్నాడు..
టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా.. 18వ లోక్‌సభ మొదటి రోజు సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా.. 2019, 2024కి సంబంధించిన కొంతమంది మహిళా ఎంపీలతో కలిసి ఉన్న ఒక ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతేకాకుండా.. 'యోధులు తిరిగి వచ్చారు' అని రాశారు. 2019 ఫొటోలో.. ఎంపీలు మహువా మొయిత్రా, కనిమొళి, సుప్రియా సూలే, జ్యోతిమణి, తమిజాచి తంగపాండియన్‌లు లోక్‌సభలో కూర్చున్నట్లు ఉండగా.. తాజా ఫొటోలో సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ డింపుల్ యాదవ్ ఉన్నారు.
యాపిల్ సీఈవో టిమ్ కుక్‌ను 13 ఏళ్ల భారతీయ సంతతికి చెందిన కుర్రాడు కలవడం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కాగా.. యాపిల్ (Apple) అతిపెద్ద ఈవెంట్ వరల్డ్‌వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ 2024 జరుగుతోంది. ఈవెంట్ మొదటి రోజున ఆపిల్ తన వినియోగదారుల కోసం అనేక పెద్ద ప్రకటనలు చేసింది. ఈ క్రమంలో ఆపిల్ యొక్క ఈ వార్షిక ఈవెంట్‌లో చాలా మంది వ్యక్తులు భాగమయ్యారు. ఈ ఈవెంట్‌కు సంబంధించిన విభిన్న ఫోటోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి.…
సన్ రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జేయింట్స్ ఘోర పరాజయం పొందిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన లక్నో.. 165 పరుగులు చేసింది. ఈ క్రమంలో.. 166 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ ఒక్క వికెట్ కోల్పోకుండా విజయం సాధించింది. ఈ క్రమంలో.. లక్నో సూపర్ జెయింట్స్ యజమాని సంజీవ్ గోయెంకా కెప్టెన్ కేఎల్ రాహుల్ పై విరుచుకుపడిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
బిగ్ బాస్ సీజన్ 7 ఎంత ఆసక్తిగా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. సీజన్ మొత్తం పల్లవి ప్రశాంత్ పైనే నడిచింది.. హౌస్ లోకి కామన్ మ్యాన్, రైతు బిడ్డగా ఎంట్రీ ఇచ్చి తన ఆట, మాటతో అభిమానులను సంపాదించుకున్నాడు.. చివరివరకు హౌస్లో తన హవాను కొనసాగిస్తూ ఫైనల్ గా టైటిల్ విన్నర్ గా ట్రోఫీని సొంతం చేసుకున్నాడు.. పల్లవి ప్రశాంత్, హీరో శివాజీ, యావర్ ఒక బ్యాచ్గా ఉన్న సంగతి తెలిసిందే.. ముఖ్యంగా హీరో శివాజీ అంటే…
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానులకు ఇదొక శుభవార్త. ఆర్సీబీ (RCB) కొత్త జెర్సీ లీక్ అయింది. ఈ జెర్సీని ఆర్సీబీ రివీల్ చేయాల్సి ఉండగా.. జెర్సీ లీక్ అయిపోయింది. ఆర్సీబీ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్, భారత దిగ్గజ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ కొత్త జెర్సీలో కనిపిస్తున్నారు. కోహ్లీ తన జట్టుతో కలిసి ప్రాక్టీస్ చేస్తున్నాడు. మరోవైపు కోహ్లి, సిరాజ్‌లు కొత్త జెర్సీ ధరించిన ఫొటో వైరల్ అవుతోంది.
బ్రిటన్ మాతృ దినోత్సవం సందర్భంగా ఆదివారం విడుదల చేసిన ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ కేట్ మిడిల్టన్ ఫొటోపై పెద్ద దుమారమే చెలరేగింది. అంతర్జాతీయ మీడియా, సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.
వరల్డ్ కప్ ట్రోఫీపై కాళ్లు పెట్టడంపై మిచెల్ మార్ష్ స్పందించాడు. "నేను వరల్డ్ కప్ ను అగౌరవపర్చాలన్న ఉద్దేశంతో అలా చేయలేదని అన్నాడు. కావాలంటే వరల్డ్ కప్ ట్రోఫీపై మళ్లీ కాళ్లు పెడతానని చెప్పుకొచ్చాడు. అందులో ఎలాంటి సందేహం లేదన్నాడు. ఆ రోజున జరిగిన ఘటనపై నేనేమీ పెద్దగా ఆలోచించలేదు". అని మార్ష్ తెలిపాడు. ఈ విషయంపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతున్న విషయం తనకు ఇతరుల ద్వారా తెలిసిందన్నాడు.