ఒక్కోరోజు ఒక్కో దేవుడికి కేటాయించారు.. మంగళవారమును వారలలోకెల్లా అత్యంత పవిత్రమైన వారముగా పరిగణిస్తారు. ఈ రోజున ఆంజనేయుడు తన భక్తుల కష్టాలను దూరం చేయడానికి స్వయంగా భూమి పైకి వచ్చాడని భక్తులు నమ్ముతారు.. అందుకే ప్రతి మంగళవారం ప్రత్యేక పూజలు చెయ్యడం వల్ల దరిద్రం పోయి అదృష్టం పడుతుందని నిపుణులు చెబుతున్నారు.. అసలు ఈరోజు ఎలా పూజలు చేస్తే హనుమాన్ అనుగ్రహం కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..
మీరు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న, మీ ఖర్చులతో పోలిస్తే మీ ఆదాయం పెరగకపోయినా మీరు మంగళవారం సాయంత్రం హనుమంతునికి గులాబీ దండ. కేవడా పరిమళాన్ని సమర్పించాలి. ఇలా చేయడం ద్వారా కొత్త ఆదాయ వనరులు వస్తాయి. మీ పిల్లవాడు నిద్రపోతున్నప్పుడు ఏడుస్తున్న లేదా భయపడిన మంగళవారం నీలకంఠుడి ఈకను తీసుకొని మంచం మీద ఉంచాలి.. ఈ విధంగా చెయ్యడం వల్ల పిల్లలు హాయిగా, ఎటువంటి భయం లేకుండా హాయిగా నిద్రపోతారు..
మీకు బలమైన కోరిక ఉంటే మంగళవారం హనుమాన్ గుడికి వెళ్లి ఆయన నుదుట కుంకుమను తీసుకొని రాముడు, సీత పాదాలకు రాయాలి.. ఈ పరిహారం చేయడం వల్ల తన భక్తుల పై హనుమంతుడి ఆశీర్వాదాలు ఎప్పుడూ ఉంటాయి. అంతే కాకుండా నిలిచిపోయిన పనులు పూర్తి అవ్వడానికి మంగళవారం రోజు ఆవాలు, బార్లీ పిండి మరియు నల్ల నువ్వులు, రొట్టెలను తయారు చేయాలి. దాని పై బెల్లం మరియు నూనె చల్లి ఆవు కు పెట్టడం వల్ల అనేక రకాల సమస్యలు తగ్గిపోతాయి.. ఆర్థిక ఇబ్బందులు పోయి సంతోషంగా ఉంటారు..