స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో అరెస్ట్ అయినా.. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. దీంతో ఆయనను కలిసేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తున్నారు. అయితే, నేడు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబును అనుమతులు లభిస్తే ములాఖత్ లో భువనేశ్వరి, లోకేష్, బ్రహ్మిణి కలవనున్నారు. ఇప్పటికే ములాఖత్ కొరకు జైలు అధికారులకి కుటుంబ సభ్యులు దరఖాస్తు చేసుకున్నారు. మధ్యాహ్నం తర్వాత కలిసే అవకాశం ఉందని టీడీపీ వర్గాలు తెలిపాయి.
Read Also: Redmi Note 13 Pro Series : అదిరిపోయే ఫీచర్స్ తో రెడ్‌మి నోట్ 13ప్రో సిరీస్ వచ్చేస్తోంది…వివరాలివే..
ఇక, జైలులో ఉన్న చంద్రబాబును కలిసేందుకు నారా లోకేష్ లాయర్లతో చర్చలు జరుపుతున్నారు. బెయిల్ రాకపోతే వెంటనే చంద్రబాబును జైలులోనే కలిసేందుకు అనుమతి కోరుతు లోకేష్ తరపున లాయర్లు పిటీషన్ వేయబోతున్నారని సమాచారం. ఇవాళ ములాఖత్ దొరకకపోతే.. మరోసారి రేపు ప్రయత్నించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. తర్వాత విజయవాడకు తిరిగిరాగానే పార్టీలోని సీనియర్లందరితో లోకేష్ సమావేశం కాబోతున్నట్లు తెలుస్తుంది. పనిలో పనిగా జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ తో పాటు వామపక్షాల కార్యదర్శులతో పాటు కలిసొచ్చే పార్టీల ముఖ్య నేతలతో లోకేష్ సమావేశం అవ్వాలని డిసైడ్ అయ్యారు.
Read Also: Tuesday : మంగళవారం ఇలా చేస్తే అదృష్టం పడుతుంది.. డబ్బే డబ్బు..
అయితే, చంద్రబాబుకు సంఘీభావంగా అన్నిపార్టీల మద్దతు కోరాలన్నది లోకేష్ ఆలోచన చేస్తున్నారు. ఇవన్నీ జరగాలంటే తాను పాదయాత్రకు విరామం ఇవ్వక తప్పదనే ఆలోచనలో లోకేష్ ఉన్నట్లు పార్టీ వర్గాల టాక్. ఇప్పటికే మూడు రోజులుగా పాదయాత్రకు బ్రేక్ పడింది. చంద్రబాబు విడుదలయ్యే వరకు పార్టీ పరంగా రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించేందుకు టీడీపీ సిద్ధమవుతుంది.