Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Trending News Ragi Bread Recipe Without Yeast Gluten Free Healthy

Ragi Bread : ఈస్ట్ అక్కర్లేదు.. గ్లూటెన్ భయం లేదు.. ఆరోగ్యకరమైన ‘రాగి బ్రెడ్’ ఇప్పుడు ఇంట్లోనే.!

Published Date :April 10, 2026 , 6:12 pm
By Gogikar Sai Krishna
  • ఈస్ట్ లేకుండా సులభంగా రాగి బ్రెడ్ తయారీ
  • గ్లూటెన్ ఫ్రీ బ్రెడ్ కోసం ఇసబ్‌గోల్ సీక్రెట్
  • ఆరోగ్యానికి మేలు చేసే రాగి పోషకాలు
  • బ్రేక్‌ఫాస్ట్‌కు బెస్ట్ హెల్తీ ఆప్షన్
Ragi Bread : ఈస్ట్ అక్కర్లేదు.. గ్లూటెన్ భయం లేదు.. ఆరోగ్యకరమైన ‘రాగి బ్రెడ్’ ఇప్పుడు ఇంట్లోనే.!
  • Follow Us :
  • google news
  • dailyhunt

సాధారణంగా బ్రెడ్ అంటే మైదా, ఈస్ట్ వంటి పదార్థాలతో చేస్తారని, అది ఆరోగ్యానికి అంత మంచిది కాదని చాలామంది భావిస్తుంటారు. కానీ, పాల కంటే మూడు రెట్లు ఎక్కువ క్యాల్షియం కలిగిన రాగులతో, ఎటువంటి రసాయనాలు లేకుండా బ్రెడ్ తయారు చేసుకోవచ్చని మీకు తెలుసా? రాగిలో ఫైబర్, ఐరన్, అమైనో యాసిడ్స్ , యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. గ్లూటెన్ లేని రాగి పిండితో బ్రెడ్ మెత్తగా రావడం కోసం ఇందులో మనం ‘ఇసబ్‌గోల్’ (Psyllium Husk) ఉపయోగిస్తాం. ఇది గ్లూటెన్ చేసే పనిని చేస్తూ బ్రెడ్‌కు మంచి ఆకృతిని ఇస్తుంది.

కావాల్సిన పదార్థాలు:

  • రాగి పిండి: 2 కప్పులు
  • ఓట్స్ పౌడర్: 4 టేబుల్ స్పూన్లు
  • ఇసబ్‌గోల్ (Psyllium Husk): 2 టేబుల్ స్పూన్లు
  • పెరుగు: అర కప్పు
  • నీళ్లు: 2 కప్పులు (అవసరాన్ని బట్టి)
  • ఉప్పు: 1 టీస్పూన్
  • బెల్లం పొడి: 2 టీస్పూన్లు
  • నూనె: 2 టేబుల్ స్పూన్లు
  • ఈనో (Eno): 2 టీస్పూన్లు
  • నిమ్మరసం: 1 టీస్పూన్

తయారీ విధానం:
1. ఇసబ్‌గోల్ జెల్ తయారీ:
ముందుగా 2 టేబుల్ స్పూన్ల ఇసబ్‌గోల్‌ను అర కప్పు నీటిలో కలిపి 5-7 నిమిషాల పాటు పక్కన పెట్టాలి. ఇది కాసేపటికి జిగురులాంటి (Gel) పదార్థంగా మారుతుంది. ఇది బ్రెడ్ ముక్కలు విడిపోకుండా ఉండటానికి సహాయపడుతుంది.

2. పిండి మిశ్రమం:
ఒక గిన్నెలో రాగి పిండి, ఓట్స్ పౌడర్, ఉప్పు , బెల్లం పొడి వేసి బాగా కలపాలి. అందులో పెరుగు, ముందుగా సిద్ధం చేసుకున్న ఇసబ్‌గోల్ జెల్ , మిగిలిన నీటిని పోసి మెత్తని బ్యాటర్‌లా (Loose batter) కలుపుకోవాలి. చివరగా నూనె వేసి మరోసారి కలపాలి.

3. బేకింగ్ కోసం సిద్ధం:
ఇప్పుడు ఈ మిశ్రమంలో ఈనో , నిమ్మరసం వేయాలి. ఇవి వేయగానే బ్యాటర్ ఉబ్బి తేలికగా మారుతుంది. వెంటనే ఈ మిశ్రమాన్ని నూనె రాసిన బ్రెడ్ టిన్ (Loaf tin) లోకి మార్చుకోవాలి.

4. బేకింగ్ సమయం:
ఓవెన్‌ను 180°C వద్ద ఉంచి, 30 నుండి 35 నిమిషాల పాటు బేక్ చేయాలి. బ్రెడ్ ఉడికిన తర్వాత బయటకు తీసి కనీసం 20 నిమిషాల పాటు పూర్తిగా చల్లారనివ్వాలి.

పూర్తిగా చల్లారిన తర్వాత బ్రెడ్‌ను స్లైస్‌లుగా కోసుకుంటే ఎంతో రుచికరమైన, పోషక విలువలున్న రాగి బ్రెడ్ సిద్ధం. దీనిని బ్రేక్‌ఫాస్ట్ లేదా ఈవినింగ్ స్నాక్‌గా తీసుకోవచ్చు. మైదా బ్రెడ్ ఇచ్చే అనారోగ్య భయం లేకుండా, ఇంటిల్లిపాదీ ఈ హెల్తీ రాగి బ్రెడ్‌ను ఎంజాయ్ చేయవచ్చు..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Gluten Free Bread
  • healthy recipes
  • Homemade Bread
  • Millet Recipes
  • Ragi Bread

తాజావార్తలు

  • Ragi Bread : ఈస్ట్ అక్కర్లేదు.. గ్లూటెన్ భయం లేదు.. ఆరోగ్యకరమైన ‘రాగి బ్రెడ్’ ఇప్పుడు ఇంట్లోనే.!

  • Allu Arjun Remuneration: ఇండియన్ సినిమాలో సరికొత్త రికార్డు.. ‘రాకా’ కోసం అల్లు అర్జున్ అన్ని కోట్లు తీసుకుంటున్నారా?

  • Yamuna River: యమునా నదిలో ఘోర పడవ ప్రమాదం.. స్పాట్‌లో 9 మంది మృతి.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం..

  • Amit Shah: బాబ్రీ మసీదు వాళ్లతో కలవడం కన్నా, 20 ఏళ్లు ప్రతిపక్షంలోనే ఉంటాం

  • Stock Market: స్టాక్ మార్కెట్లో పెరుగుతున్న మ్యూచువల్‌ ఫండ్‌ ఇన్వెస్టర్స్.. రికార్డు స్థాయిలో సిప్‌(SIP)లు.. కారణం ఇదే..

ట్రెండింగ్‌

  • రికార్డు సృష్టించిన MG Majestor.. రైలును లాగి గిన్నిస్ బుక్‌లో స్థానం!

  • Car Prices Hike: కారు కొనాలనుకుంటే కోనేయండమ్మా.. మే 1 నుండి మరింత కాస్ట్లీ కాబోతున్నాయి..!

  • Kitchen Tips : బెండకాయ కోస్తున్నప్పుడు జిగురు అంటకుండా ఈ స్మార్ట్ టిప్స్ మీ కోసమే.!

  • Egg 65 Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘ఎగ్ 65’.. ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోండిలా.!

  • కొత్త లుక్, అప్డేటెడ్ ఫీచర్లతో మళ్లీ మార్కెట్‌లోకి Bajaj Pulsar 180 రీలాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions