Allu Arjun Remuneration: ఇండియన్ సినిమాలో సరికొత్త రికార్డు.. ‘రాకా’ కోసం అల్లు అర్జున్ అన్ని కోట్లు తీసుకుంటున్నారా?
- అల్లు అర్జున్, మాస్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో 'రాకా'
- ఫస్ట్ లుక్ పోస్టర్‌తోనే భారీ హైప్
- రాకా' కోసం అల్లు అర్జున్ రెమ్యునరేషన్ ఎంతంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Allu Arjun Remuneration for Raaka Movie: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మాస్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘రాకా’. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌తోనే ఈ సినిమా సోషల్ మీడియాలో భారీ అంచనాలను క్రియేట్ చేసింది. ఈ సినిమా బడ్జెట్, నటీనటుల రెమ్యునరేషన్లకు సంబంధించిన వార్తలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ఈ సినిమాను అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తోంది. ప్రాథమికంగా ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ కోసం రూ. 800 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు వార్తలు వచ్చినప్పటికీ.. తాజా సమాచారం ప్రకారం ఈ బడ్జెట్ రూ.900 నుంచి రూ.1000 కోట్ల వరకు చేరుకున్నట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్, అట్లీ మార్క్ మాస్ ఎలిమెంట్స్ కోసం నిర్మాతలు ఎక్కడా రాజీ పడకుండా ఖర్చు చేస్తున్నారట.
ఈ భారీ ప్రాజెక్టులో నటీనటుల రెమ్యునరేషన్లు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. రాకా సినిమా కోసం అల్లు అర్జున్ దాదాపు రూ.175 కోట్ల భారీ పారితోషికం అందుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. కథానాయికగా నటిస్తున్న బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనేకి దాదాపు రూ.25 కోట్లు చెల్లిస్తున్నట్లు సమాచారం. కీలక పాత్రలో కనిపించనున్న రష్మిక మందన్నకు రూ. 5 నుంచి 7 కోట్ల వరకు రెమ్యునరేషన్ ఇస్తున్నట్లు టాక్.
Also Read
Also Read: Athidi Release: ‘అతిథి’ రీ-రిలీజ్.. సాహసోపేతమైన నిర్ణయం, వర్కౌట్ అవుతుందా?
రాకా సినిమా బడ్జెట్‌లో ఎక్కువ భాగం కేవలం విజువల్స్ కోసమే కాకుండా.. అల్లు అర్జున్ పోషించబోయే ‘మృగం’ లాంటి విభిన్నమైన అవతారం కోసం వెచ్చిస్తున్నట్లు సమాచారం. ఈ లుక్ కోసం చేసే మేకప్, కాస్ట్యూమ్స్, గ్రాఫిక్స్ భారతీయ తెరపై మునుపెన్నడూ చూడని విధంగా ఉండబోతున్నాయట. 2027లో ప్రేక్షకుల ముందుకు రానున్న రాకా చిత్రం భారతీయ సినిమా చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచిపోతుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. భారీ బడ్జెట్, అగ్ర తారాగణం, అట్లీ మేకింగ్ స్టైల్ అన్నీ కలిపి రాకాను గ్లోబల్ లెవల్ సినిమాగా నిలబెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.
తాజావార్తలు
-
Supreme Court: సీజేపీ నిరసన ఎఫెక్ట్.. పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
-
Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
-
Redmi K200 Series: Redmi K200 సిరీస్‌లో 7 ఇంచుల 2K డిస్‌ప్లే?.. హై రిఫ్రెష్ రేట్‌తో రానున్న కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్లు!
-
Rashmika Mandanna : మరోసారి పుష్పరాజ్ అండ్ శ్రీవల్లి కాంబో ఆకట్టుకోబోతుందా..?
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!