Raghunandan Rao : నేను ఎవరి దయాదాక్షణ్యాల మీద గెలవలేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పట్టపగలు నోట్ల కట్టలతో దొరికిన దొంగ రేవంత్ రెడ్డి అని సమాజానికి తెలుసు అని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. ఇవాళ ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. సొంత జిల్లాల్లో ఎమ్మెల్సీ, ఎంపీ గెలిపించుకోలేని రేవంత్ రెడ్డి పొంకణాలు కొడుతున్నారని, నేను ఎవరి దయాదాక్షణ్యాల మీద గెలవలేదన్నారు. మల్కాజ్ గిరి సీటు ఎంతకు అమ్ముకున్నావు రేవంత్ రెడ్డి చెప్పాలన్నారు రఘునందన్ రావు. సిట్టింగ్ సీటు మల్కాజ్ గిరి ఓడిపోతే మాట్లాడని రేవంత్ రెడ్డి కి మెదక్ గురించి ఎందుకు..? అని, హరీష్ రావు నాకు మద్దతు ఇచ్చారనీ తప్పుడు ప్రచారం చేయడం సరైంది కాదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతిలో నీళ్ల మంత్రిగా ఉన్న హరీష్ రావును ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్ రాంరెడ్డి డబ్బులు పంచుతుంటే ఎందుకు ఆపలేకపోయావు..? అని ఆయన ప్రశ్నించారు.
అంతేకాకుండా..’ఒక్క పోలీస్ కూడా రేవంత్ రెడ్డి మాటలు వినడం లేదు. రేవంత్ రెడ్డి ప్రియ మిత్రుడు హరీష్ రావును సిద్దిపేటలో ఓడించేది బీజేపీనే. రఘునందన్ రావు జై తెలంగాణ అని రోడ్డు ఎక్కినోడు, ఉద్యమంలో పాల్గొన్నాడు. రఘునందన్ రావుపై మాట్లాడేటప్పుడు రేవంత్ రెడ్డి ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. ఎనిమిది చోట్ల విజయం సాధించిన కాంగ్రెస్ కు బీఆర్ఎస్ ఓటు బ్యాంకు బదిలీ అయ్యిందా. హరీష్ రావు నాకు ఓట్లు వేయించారని భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి వచ్చి రేవంత్ రెడ్డి ప్రమాణం చేయాలి. నీలం మధు హరీష్ రావు శిష్యుడు కాదా..? నీలం మధును బలిపశువును చేసింది రేవంత్ రెడ్డి కాదా..? నీలం మధును హరీష్ రావు, రేవంత్ రెడ్డి కలిసి బకరాను చేశారు అని ఆయన అన్నారు. తెలంగాణ పౌరుషం ఉంటే.. 25 రోజుల్లో కేసీఅర్, హరీష్ రావును రేవంత్ రెడ్డి అరెస్ట్ చేయించాలని, రఘునందన్ రావు గురించి మాట్లాడే తప్పుడు రేవంత్ రెడ్డి ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలన్నారు రఘునందన్ రావు. రేవంత్ రెడ్డి కన్న రెండు ఆకులు ఎక్కువే చదివా అని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read
- మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
- Telangana High Court: "ఆ పోలీసులను గుర్తించండి".. అసెంబ్లీ దగ్గర మహిళా ఎమ్మెల్యేల ఘటనపై హైకోర్టు ఉత్తర్వులు..
- Pentagon Cyberattack: అమెరికా సైనికుల డేటాబేస్‌లోకి హ్యాకర్లు.. 9 నెలల పాటు తిష్ట.. 27.6 లక్షల మంది డేటా లీక్!
- Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
తాజావార్తలు
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Telangana High Court: “ఆ పోలీసులను గుర్తించండి”.. అసెంబ్లీ దగ్గర మహిళా ఎమ్మెల్యేల ఘటనపై హైకోర్టు ఉత్తర్వులు..
-
Praveen Kumar: ఏదైనా చేయాలనుంది.. కీలక పదవికి దరఖాస్తు చేసిన టీమిండియా మాజీ పేసర్!
-
Ramayana : రామాయణ ప్రీ పోన్.. మూడు రోజులు ముందుగా థియేటర్స్‌లోకి
-
Pentagon Cyberattack: అమెరికా సైనికుల డేటాబేస్‌లోకి హ్యాకర్లు.. 9 నెలల పాటు తిష్ట.. 27.6 లక్షల మంది డేటా లీక్!
ట్రెండింగ్
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!
-
12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR MagicPad 4 ట్యాబ్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
October 2026 Rule Changes: అక్టోబర్‌లో మారనున్న కీలక రూల్స్.. బ్యాంక్, LPG, UPI నుంచి ITR వరకు పూర్తి లిస్ట్ ఇదే!
-
Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!