Radhakumari Success: నిజంగా ఓ మహిళ చరిత్ర సృష్టించింది. కలలు కన్న ఉద్యోగాన్ని ఒడిసి పట్టుకోడానికి పెళ్లి, పిల్లలు అడ్డురావని తన విజయంతో నిరూపించింది. ఏకంగా 5 ప్రభుత్వ కొలువులు సాధించి ఔరా అనిపించింది. ఇదేం అంత సామాన్య విషయం కాదు. నిజంగా తన పోరాటం అసామాన్యం. ఇద్దరు పిల్లలకు తల్లిగా, భర్తకు భార్యగా అనుక్షణం వారి వెంటనే ఉంటూ.. తన లక్ష్యాన్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా నిరంతరం చదువుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన మోగా డీఎస్సీలో ఒకేసారి 5 ప్రభుత్వ ఉద్యోగాలను సాధించి ఎంతో మహిళలకు ప్రేరణగా నిలిచింది రాధాకుమారి. అనితరసాధ్యమైన విజయాన్ని సాధించిన ఈ మహిళ కథ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..
READ ALSO: Chhattisgarh :: ప్రభుత్వ ఉద్యోగులు మరీ ఇలా ఉన్నారేంటీ…
జీవిత కాలపు కలను నిజం చేసుకున్నారు..
శ్రీకాకుళం జిల్లాలోని సరుబుజ్జిలి మండలం మతలబు పేట గ్రామానికి చెందిన చింతాడ రాధాకుమారి – కేఎల్ నాయుడు భర్యాభర్తలు. రాధాకుమారి భర్త కేఎల్ నాయుడు హైదరాబాదులో ఎల్ఐసీ ఏజెంట్‌గా పనిచేస్తున్నారు. 2016లో ఈ జంటకు ట్విన్స్ (పాప, బాబు) జన్మించారు. ఆమె అందరిలాగానే ఓ సాధారణ గృహిణి. తన భర్త, ఇద్దరు పిల్లలు ఇదే తన జీవితం. వాస్తవంగా తనకు పెద్దగా కోరికలేవీ లేవని, ఎప్పటికైనా టీచర్ కావాలన్నది తన జీవితాశయం అని చెప్పారు. రాధాకుమారి.. నాగార్జున యూనివర్సిటీ నుంచి MA తెలుగు సబ్జెక్టులో పీజీ పూర్తి చేశారు. ఆ తర్వాత వైజాగ్ నుంచి ల్యాంగ్వేజ్ పండిట్ కోర్సు (2018-19), ఉమ్మడి హైదరాబాద్‌లో టీటీసీ (2013), ఆంధ్రా యూనివర్సిటీ నుంచి 2023 బీఎడ్ డిగ్రీలు పూర్తి చేశారు. ఓ వైపు సంసారసాగరంలో ముగిని తేలుతూనే.. మరోవైపు ఐదేళ్ల పాటు డీఎస్సీకి లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకున్నారు. ఏపీలో కూటమి సర్కార్ వచ్చిన తర్వాత ప్రకటించిన మెగా డీఎస్సీకి తాను చదివిన డిగ్రీలన్నింటికీ సరిపోయే ఉద్యోగాలకు ఆమె దరఖాస్తులు చేసుకున్నారు. అలాగే అన్ని పరీక్షలు కూడా రాశారు. ఇక్కడ విశేషం ఏమిటంటే తాజాగా వెలువడిన మెగా డీఎస్సీ ఫలితాల్లో ఆమె రాసిన అన్ని సబ్జెక్టుల్లోనూ ఎంపికై అందరినీ ఆశ్చర్యపరిచారు. ఒకే దెబ్బకు 5 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి రికార్డు సృష్టించారు.
బాధ్యతలు, బాధలు ఆశయానికి అడ్డుకాదని రాధాకుమారి నిరూపించారు. పెళ్లైనా ఓ వైపు సంసారాన్ని చక్కదిద్దుకుంటూనే, ఖాళీ సమయాల్లో చదువుకు టైం కేటాయించి, విజయాన్ని ఒడిసి పట్టారు. నేటి యువతకు ఆమె సాధించిన విజయం ఆదర్శంగా నిలుస్తుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. తన విజయం గురించి ఆమె మాట్లాడుతూ.. తన భర్త KL నాయుడు సహకారంతోనే ఈ విజయం సాధ్యం అయ్యిందని, ఆయన తనకు అన్ని విధాలుగా సహకరించారని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. రాధా కుమారి విజయంపై ఆమె కుటుంబ సభ్యులు ఆనందాన్ని వ్యక్తం చేశారు.
రాధాకుమారి సాధించిన ర్యాంకులివే..
SGT విభాగంలో 14వ ర్యాంక్ (చిత్తూరు నాలోకల్ )
SA తెలుగులో 23 వ ర్యాంక్ (శ్రీకాకుళం)
SA సోషల్ 39వ ర్యాంక్ (శ్రీకాకుళం)
TGT సోషల్‌లో 77వ ర్యాంక్ (శ్రీకాకుళం)
TGT తెలుగులో 113 వ ర్యాంకు (శ్రీకాకుళం)
READ ALSO: TMC MP Controversy: అమిత్‌షా తల నరికి టేబుల్‌పై పెట్టాలి.. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన టీఎంసీ ఎంపీ