TMC MP Controversy: కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ మహువా మొయిత్రా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. కేంద్ర హోంమత్రి అమిత్ షా బంగ్లాదేశ్ చొరబాట్లను ఆపలేకపోతే, ఆయన తల నరికి ప్రధానమంత్రి టేబుల్‌పై ఉంచాలని ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలతో ప్రకటన విడుదల చేశారు. దీంతో ఒక్కసారిగా ఆమె ప్రకటన రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. ఇలాగే ఆమె గతంలో కూడా పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సందర్భాలు ఉన్నాయి.
READ ALSO: Asia Cup 2025: ఆ ఐదుగురు ప్లేయర్లు దుబాయ్‌కు వెళ్లరు: బీసీసీఐ
సరిహద్దులను రక్షించే బాధ్యత హోంమంత్రిదే..
దేశ సరిహద్దులను రక్షించే బాధ్యత హోంమంత్రిదేనని ఎంపీ మహువా మొయిత్రా అన్నారు. ఆగస్టు 15న ఎర్రకోట నుంచి చొరబాట్లపై ప్రధాని మాట్లాడుతున్నప్పుడు, హోంమంత్రి మొదటి వరుసలో కూర్చుని చప్పట్లు కొడుతున్నారు. లక్షలాది మంది భారత్‌లోకి అక్రమంగా చొరబడుతూనే ఉన్నారు. మన భూమిని ఆక్రమించుకుంటున్నారని అన్నారు. దేశాన్ని రక్షించడంలో హోంమంత్రి విఫలమయ్యారని, కాబట్టి ఆయన తల నరికి ప్రధానమంత్రి టేబుల్ మీద ఉంచాలని మొయిత్రా తీవ్ర స్థాయిలో విమర్శించారు. తాజాగా ఆమె చేసిన ప్రకటన రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. ప్రజలు నుంచి కూడా ఎంపీ ప్రకటనపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి.
గతంలోను పలు వివాదాస్పద వ్యాఖ్యలు..
టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా గతంలోనూ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచిన సందర్భాలు ఉన్నాయి. 2021లో ఆమె లోక్‌సభలో మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్‌పై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. న్యాయవ్యవస్థ నిష్పాక్షికతను ఆమె ప్రశ్నించడంతో పాటు, గొగోయ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలను లోక్‌సభలో ప్రస్తావించారు. నాడు ఈ ప్రకటనపై సభలో తీవ్ర దుమారం చెలరేగింది. 2022లో అహ్మదాబాద్‌లో మాంసాహారంపై నిషేధం నేపథ్యంలో లోక్‌సభలో మహువా మొయిత్రా జైన సమాజం గురించి ప్రస్తావించారు. జైన సమాజం దీనిని అవమానకరంగా భావించింది. మాజీ ఎంపీ విజయ్ దర్దా ఈ ప్రకటనను ఖండించడంతో, క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 2023లో లోక్‌సభలో మొయిత్రా అధికార పార్టీ సభ్యురాలిపై దుర్భాషలాడినట్లు ఆరోపణలు ఉన్నాయి. 2024లో మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ రేఖశర్మ.. హత్రాస్ తొక్కిసలాట స్థలానికి గొడుగు పట్టుకున్న వ్యక్తితో వెళుతున్న వీడియోపై మహువా మొయిత్రా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యపై మహిళా కమిషన్ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆమెపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు అయ్యింది.
READ ALSO: Luknow: లక్నోలో విషాదం.. అసలేమైందంటే…