రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు తీవ్ర అన్యాయం చేస్తోంది అని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య అన్నారు. ఎన్నికల కోడ్ పేరుతో బీసీలకు లక్ష రూపాయల ఆర్థిక సహాయం ఇవ్వకుండా తప్పించుకునేందుకు కుట్ర చేస్తుందని ఆయన ఆరోపించారు. ఎంతో మంది లక్ష రూపాయల కోసం ఎదిరిచూస్తున్నారు.. బీసీ కులాలందరికి లక్ష రూపాయలు ఇవ్వాలి.. ఎన్నికల సమయంలో పథకాలు తెస్తున్నారు.. మేము కూడా ఈ టైంలోనే ఒత్తిడి తెస్తామని ఆయన పేర్కొన్నారు.
Read Also: Jailer: ఇదేంటి బాసూ రజనీ గాలి ఇట్టా తీసేశారు.. చూసుకోబళ్ళా?
రాష్ట్ర ప్రభుత్వం ఫ్లై ఓవర్ లు, స్కై ఓవర్లకు వేల కోట్లు పెడుతున్నారు.. బీసీలకు లక్ష రూపాయలు ఇవ్వడం లేదు అని ఆర్ కృష్ణయ్య అన్నారు. బీసీల కోసం 10 వేల కోట్ల రూపాయలు కేటాయించాలి అని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే గ్రామాల్లో ఎమ్మెల్యేలను తిరగనివ్వం.. బీసీ బంధు ఇస్తామని మోసం చేశారు. విదేశీ విద్యకు దరఖాస్తు చేసుకున్న అందరికి ఇవ్వాలి.. ఫీజుల బకాయిలు 5 వేల కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉన్నాయి.. వెంటనే వాటిని విడుదల చేయాలి అని కృష్ణయ్య తెలిపారు.
Read Also: Lokesh Kanagaraj: కొత్త కారు కొన్న ‘విక్రమ్’ డైరెక్టర్.. ధర ఎంతంటే ..?
గురుకుల పాఠశాలకు సొంత భవనాలు కట్టాలి అని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య తెలిపారు. అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు 50 శాతం టికెట్లు ఇవ్వాలి అని ఆయన డిమాండ్ చేశారు. దీని వల్ల బీసీలకు తగిన న్యాయం జరుగుతుందని ఆర్ కృష్ణయ్య అన్నారు.