Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాట్‌లో ఎన్విడియా ఏఐ చిప్స్..? ఆ దేశ క్రికెట్ బోర్డ్ ఆసక్తికర పోస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vaibhav Sooryavanshi: ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 (Asia Cup Rising Stars 2026) టోర్నీలో టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) ఆడిన విధ్వంసకర ఇన్నింగ్స్‌కు ఐస్‌ల్యాండ్ క్రికెట్ (Iceland Cricket) అదిరిపోయే రియాక్షన్ ఇచ్చింది. కేవలం 53 బంతుల్లోనే 28 సిక్సర్లతో 204 పరుగులు బాది ప్రపంచ క్రికెట్‌ను ఆశ్చర్యపరిచిన ఈ 15 ఏళ్ల కుర్రాడి బ్యాటింగ్‌పై ఐస్‌ల్యాండ్ క్రికెట్ చేసిన ఓ సరదా పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పోస్ట్‌లో ఏకంగా ఎన్విడియా సీఈవో జెన్సన్ హువాంగ్ (Nvidia CEO Jensen Huang) పేరును ప్రస్తావించడం విశేషం. “మంగళవారం జెన్సన్ హువాంగ్ తిరిగి ఎన్విడియా సీఈవోగా బాధ్యతలు చేపట్టడం, ఆ మరుసటి రోజే అంటే బుధవారం వైభవ్ సూర్యవంశీ బ్యాట్‌లోని ఏఐ చిప్స్ (AI chips) మళ్లీ పనిచేయడం మొదలవ్వడం కేవలం యాదృచ్ఛికం కాదు” అంటూ ఐస్‌ల్యాండ్ క్రికెట్ ఎక్స్ (X) వేదికగా ఫన్నీగా ట్వీట్ చేసింది.
యూఏఈ ఏ (UAE A) జట్టుతో జరిగిన చావోరేవో లాంటి కీలక మ్యాచ్‌లో ఇండియా ఏ (India A) తరఫున బరిలోకి దిగిన వైభవ్, ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈ అద్భుత విజయంతో భారత్ సెమీఫైనల్ (Semifinals) బెర్త్‌ను ఖాయం చేసుకుంది. ఈ క్రమంలో వైభవ్ రికార్డుల పుస్తకాలను తిరగరాశాడు. కేవలం 28 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి, ఆస్ట్రేలియా ఓపెనర్ జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్ (Jake Fraser-McGurk) పేరిట ఉన్న ఫాస్టెస్ట్ లిస్ట్ ఏ సెంచరీ (Fastest List A Century) రికార్డును బద్దలు కొట్టాడు. ఆ తర్వాత కూడా తన జోరు ఏమాత్రం తగ్గించకుండా 52 బంతుల్లోనే డబుల్ సెంచరీ మార్క్ అందుకుని, లిస్ట్ ఏ క్రికెట్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన డబుల్ సెంచరీ (Fastest List A Double Ton) నమోదు చేశాడు. మొత్తం 53 బంతులు ఎదుర్కొన్న వైభవ్, 7 ఫోర్లు, 28 భారీ సిక్సర్లతో 204 పరుగులు చేశాడు. ఒకే ప్రొఫెషనల్ క్రికెట్ ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్‌గానూ కొత్త చరిత్ర సృష్టించాడు.
Also Read
- Mulugu: భార్య చేతిలో మరో భర్త బలి? ప్రియుడితో కలిసి ఘాతుకం..!
- Chris Gayle: వైభవ్ విధ్వంసానికి క్రిస్ గేల్ ఫిదా.. వన్డేల్లో 300 పరుగులు ఖాయమంటూ జోస్యం..!
- Kishan Reddy: ప్రచారం కోసమో, లైక్‌ల కోసమో యాత్ర చేయడం లేదు.. 'నషా ముక్త్ భారత్'పై కేంద్ర మంత్రి..
- Nampally Railway Station Demolition: 119 ఏళ్ల చరిత్రకు ముగింపు.. నాంపల్లి రైల్వే స్టేషన్ కూల్చివేత..!
మరోవైపు, రికార్డుల మీద రికార్డులు కొల్లగొడుతున్న ఈ టీనేజ్ బ్యాటింగ్ సంచలనానికి టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) మద్దతుగా నిలిచాడు. బుధవారం వార్తా సంస్థ ఏఎన్ఐ (ANI) తో మాట్లాడిన గంగూలీ, వైభవ్ సూర్యవంశీని భారత క్రికెట్ భవిష్యత్తు (Future of Indian Cricket) గా అభివర్ణించాడు. అతను చాలా మంచి ప్లేయర్ అని, ఇంత చిన్న వయసులోనే ఐపీఎల్ (IPL) లోనూ ఎంతో అద్భుతంగా ఆడాడని కొనియాడాడు. భారత్ తరఫున వచ్చిన ప్రతి అవకాశాన్ని అతను చక్కగా ఉపయోగించుకున్నాడని, అతనొక గొప్ప ప్రాస్పెక్ట్ అని దాదా ప్రశంసించాడు. అయితే, ఇప్పుడే వైభవ్‌ను ఇతర దిగ్గజ క్రికెటర్లతో పోల్చవద్దని గంగూలీ అభిమానులకు, విశ్లేషకులకు సూచించాడు. అనవసరమైన పోలికలు తెచ్చి అతనిపై ఒత్తిడి పెంచకుండా, తనదైన శైలిలో ఆటను ఆస్వాదిస్తూ ఎదగనివ్వాలని అన్నాడు. అతను ఎడమచేతి వాటం బ్యాటర్ (Left-hander) అని, వయసు ఇంకా 15–16 ఏళ్లు మాత్రమేనని గుర్తు చేస్తూ.. ప్రస్తుతం అతన్ని ప్రశాంతంగా ఆడుకోనివ్వాలని గంగూలీ కోరాడు.
It is no coincidence that on Tuesday Jensen Huang returned as Nvidia CEO, and on Wednesday, the AI chips in Vaibhav Sooryavanshi’s bat came back.
— Iceland Cricket (@icelandcricket) November 25, 2026
తాజావార్తలు
-
AP Local Body Elections Live Updates : ఏపీలో ఎన్నికల సందడి.. పల్లెలు, పట్టణాల్లో మొదలైన పోలింగ్!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాట్‌లో ఎన్విడియా ఏఐ చిప్స్..? ఆ దేశ క్రికెట్ బోర్డ్ ఆసక్తికర పోస్ట్
-
AP Local Body Elections : నంద్యాలలో రాజకీయ కారం.. టీడీపీ, వైసీపీ వర్గాల ఘర్షణ.!
-
Mulugu: భార్య చేతిలో మరో భర్త బలి? ప్రియుడితో కలిసి ఘాతుకం..!
-
Chris Gayle: వైభవ్ విధ్వంసానికి క్రిస్ గేల్ ఫిదా.. వన్డేల్లో 300 పరుగులు ఖాయమంటూ జోస్యం..!
-
Vrushakarma Trailer: గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘వృషకర్మ’ ట్రైలర్.. పీక్స్‌కు చేరిన అంచనాలు!
ట్రెండింగ్
-
Viral Cricket Video: బైక్‌పై వెళ్తూ ఒంటిచేత్తో క్యాచ్ పట్టేశాడు.. పిచ్చెక్కించే వీడియో మామ.. తప్పక చూడాల్సిందే!
-
9,530mAh బ్యాటరీ, 108MP కెమెరాతో Honor Magic 9 Lite+ 5G..!
-
Wiaan Mulder History: ట్రిపుల్ సెంచరీ.. సెంచరీ, 7 వికెట్లు.. 149 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలి ఆటగాడు!
-
WBBL 2026: క్రికెట్ చరిత్రలోనే అరుదైన ఘటన.. ఒక్క బంతి ఆడకుండానే క్లీన్ బౌల్డ్..! వీడియో వైరల్..
-
144Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీ, IPX8+IPX9+IP4X రేటింగ్స్‌తో Motorola Razr 2027..!