Viral Cricket Video: బైక్‌పై వెళ్తూ ఒంటిచేత్తో క్యాచ్ పట్టేశాడు.. పిచ్చెక్కించే వీడియో మామ.. తప్పక చూడాల్సిందే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Motorbike Catch Viral Cricket Video: క్రికెట్లో అద్భుతమైన క్యాచ్‌లు ఎన్నో చూసుంటాం. బౌండరీ లైన్ వద్ద గాల్లోకి ఎగిరి పట్టే క్యాచ్‌ల నుంచి స్లిప్స్‌లో మెరుపు వేగంతో పట్టే క్యాచ్‌ల వరకు మనం ఎన్నో స్టన్నింగ్ క్యాచ్‌లను చూశాం. అయితే సిక్సర్‌గా వెళ్లిన బంతిని బైక్‌పై వెళ్తూ ఒంటి చేత్తో క్యాచ్ పట్టుకోవడం ఎప్పుడైనా చూశారా?. పాకిస్థాన్‌లో జరిగిన ఓ లోకల్ క్రికెట్ టోర్నీలో ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. స్టేడియం బయట రోడ్డుపై బైక్‌పై ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి.. మైదానం నుంచి బయటకు దూసుకొచ్చిన బంతిని ఒంటి చేత్తో అందుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పాకిస్థాన్‌లో జరుగుతున్న స్వాట్ ప్రీమియర్ లీగ్ ఎనిమిదో సీజన్లో స్వాట్ స్ట్రైకర్స్, జీకేఆర్ దీర్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. జీకేఆర్ దీర్ ఇన్నింగ్స్ ఆరో ఓవర్లో ఓ బ్యాటర్ ఎక్స్ట్రా కవర్ మీదుగా భారీ షాట్ కొట్టాడు. బంతి సిక్సర్‌గా స్టేడియం బయటకు వెళ్లిపోయింది. అయితే అదే సమయంలో అటుగా వెళ్తున్న ఓ మోటార్ బైక్‌పై వెనుక కూర్చున్న ప్రయాణికుడు బంతిని గమనించాడు. బైక్ కదులుతుండగానే ఏమాత్రం తడబడకుండా ఒంటి చేత్తో క్యాచ్ అందుకున్నాడు. ఈ అనూహ్య క్యాచ్ చూసి అక్కడున్నవారు ఆశ్చర్యపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలోకి చక్కర్లు కొట్టడంతో.. క్రికెట్ అభిమానులు షేర్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఒక నెటిజన్ ఈ క్యాచ్‌ను ‘క్యాచ్ ఆఫ్ ది సెంచరీ’గా అభివర్ణించగా.. మరికొందరు న్యూజిలాండ్ ఫీల్డర్ గ్లెన్ ఫిలిప్స్‌ను గుర్తుచేస్తూ ‘ఫిలిప్స్ ఎవరు?’ అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. ‘పిచ్చెక్కించే వీడియో మామ’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
Also Read
- Vaibhav Sooryavanshi: 53 బంతుల్లో 204 పరుగులు.. అయినా వైభవ్‌కు వన్డే ఛాన్స్ ఇప్పుడే రాదా?
- Wiaan Mulder History: ట్రిపుల్ సెంచరీ.. సెంచరీ, 7 వికెట్లు.. 149 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలి ఆటగాడు!
- Chahal-Dhanashree: బీజేపీలోకి చహల్.. తెలుగు హీరోయిన్గా ధనశ్రీ.. విడాకుల తర్వాత కొత్త ఇన్నింగ్స్!
- WBBL 2026: క్రికెట్ చరిత్రలోనే అరుదైన ఘటన.. ఒక్క బంతి ఆడకుండానే క్లీన్ బౌల్డ్..! వీడియో వైరల్..
ఇక స్వాట్ ప్రీమియర్ లీగ్ పాకిస్థాన్‌లో నిర్వహించే స్థానిక టేప్బాల్ క్రికెట్ టోర్నమెంట్. ఇందులో ఒక్కో జట్టుకు 10 ఓవర్ల ఇన్నింగ్స్ ఉంటుంది. తొలుత బ్యాటింగ్ చేసిన స్వాట స్ట్రైకర్స్ నిర్ణీత 10 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన జీకేఆర్ దీర్‌ను 114 పరుగులకే పరిమితం చేసింది. దీంతో స్వాట్ స్ట్రైకర్స్ 34 పరుగుల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్‌లో స్వాట్ స్ట్రైకర్స్ విజయం సాధించగా.. స్టేడియం బయట బైక్‌పై ప్రయాణికుడు పట్టిన క్యాచ్ మాత్రం అందరి దృష్టిని ఆకర్షించింది.
You’ve seen the footage of the incredible one-handed catch taken on a moped after a six was hit in Pakistan’s Swat Premier League…
Now hear from the man who took it: Mehran Khan. 👏 https://t.co/P0aWRlcPlA
— Test Match Special (@bbctms) November 25, 2026
తాజావార్తలు
-
AP Local Body Elections Live Updates : ఏపీలో ఎన్నికల సందడి.. పల్లెలు, పట్టణాల్లో మొదలైన పోలింగ్!
-
Viral Cricket Video: బైక్‌పై వెళ్తూ ఒంటిచేత్తో క్యాచ్ పట్టేశాడు.. పిచ్చెక్కించే వీడియో మామ.. తప్పక చూడాల్సిందే!
-
Koti Deepotsavam Day 13 : కోటి దీపోత్సవంలో సీతారాముల కల్యాణం.. నేడు 13వ రోజు విశేషాలివే.!
-
CM Chandrababu : శ్రీవారికి 121 కిలోల బంగారు ఆభరణాలు.. నేడు తిరుమలకు సీఎం చంద్రబాబు
-
Vaibhav Sooryavanshi: 53 బంతుల్లో 204 పరుగులు.. అయినా వైభవ్‌కు వన్డే ఛాన్స్ ఇప్పుడే రాదా?
-
Parliament Winter Session 2026: డిసెంబర్ 15లోపు పార్లమెంట్ సమావేశాలు?.. మంత్రులకు ప్రధాని మోడీ కీలక ఆదేశాలు!
ట్రెండింగ్
-
9,530mAh బ్యాటరీ, 108MP కెమెరాతో Honor Magic 9 Lite+ 5G..!
-
Wiaan Mulder History: ట్రిపుల్ సెంచరీ.. సెంచరీ, 7 వికెట్లు.. 149 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలి ఆటగాడు!
-
WBBL 2026: క్రికెట్ చరిత్రలోనే అరుదైన ఘటన.. ఒక్క బంతి ఆడకుండానే క్లీన్ బౌల్డ్..! వీడియో వైరల్..
-
144Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీ, IPX8+IPX9+IP4X రేటింగ్స్‌తో Motorola Razr 2027..!
-
Life Lessons : అమ్మమ్మ ఇచ్చిన తాళంచెవి.. తరాలకు అందించిన నమ్మకం.!