9,530mAh బ్యాటరీ, 108MP కెమెరాతో Honor Magic 9 Lite+ 5G..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Honor Magic 9 Lite+ 5G: హానర్ (Honor) మరో కొత్త ఫోన్‌ను విడుదల చేసేందుకు సిద్ధమవుతుంది. Honor Magic 9 Lite+ 5G పేరుతో రానున్న ఈ ఫోన్‌కు సంబంధించిన డిజైన్ రెండర్లు, కీలక స్పెసిఫికేషన్లు తాజాగా లీక్ అయ్యాయి. ముఖ్యంగా ఇందులో ఏకంగా 9,530mAh భారీ బ్యాటరీని అందించనున్నట్లు సమాచారం. అలాగే 108MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే వంటి ఫీచర్లు కూడా ఈ ఫోన్లో ఉండనున్నాయి.
లీకైన వివరాల ప్రకారం.. Honor Magic 9 Lite+ 5Gలో 6.8 అంగుళాల AMOLED డిస్ప్లేను అందించనున్నారు. ఇది 2788 × 1280 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో పాటు 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్లో Qualcomm Snapdragon 6 Gen 5 ప్రాసెసర్‌ను ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో నాలుగు Cortex-A78 కోర్లు, నాలుగు Cortex-A55 కోర్లు ఉండనున్నాయి.
Also Read
- 144Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీ, IPX8+IPX9+IP4X రేటింగ్స్‌తో Motorola Razr 2027..!
- Flipkart CEO: 11 ఏళ్ల ప్రస్థానానికి తెర.. ఫ్లిప్‌కార్ట్ సీఈఓ రాజీనామా..
- Shenzhou-24 Mission: చరిత్ర సృష్టించిన చైనా.. తియాంగాంగ్ స్టేషన్‌కు షెన్‌జౌ-24.. తొలి విదేశీ వ్యోమగామిగా పాకిస్థానీ!
- 200MP + 200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీ, ARRI సినిమాటిక్ ఫీచర్లతో HONOR Magic9 Pro Max లాంచ్..!
కెమెరాల విషయానికి వస్తే.. వెనుకవైపు 108MP మెయిన్ కెమెరాతో పాటు 5MP అల్ట్రా వైడ్ కెమెరాను అందించనున్నారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 16MP కెమెరా ఉండనుంది. వెనుక కెమెరాలను పెద్ద సర్క్యులర్ కెమెరా మాడ్యూల్లో అమర్చినట్లు లీకైన రెండర్లలో కనిపిస్తోంది. ఈ ఫోన్లో అత్యంత ప్రత్యేకమైన ఫీచర్ బ్యాటరీ. ఇందులో ఏకంగా 9,530mAh సామర్థ్యం కలిగిన బ్యాటరీని అందించనున్నట్లు సమాచారం. దీనికి 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉండనుంది.
డిజైన్ విషయానికి వస్తే.. ఈ ఫోన్ డార్క్ గ్రే, ఆరెంజ్ యాక్సెంట్స్‌తో కూడిన బీజ్ కలర్ వేరియంట్లలో కనిపించింది. భవిష్యత్తులో మరిన్ని కలర్ ఆప్షన్లను కూడా హానర్ పరిచయం చేసే అవకాశం ఉంది. అలాగే IP68 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్, NFC, డ్యూయల్ సిమ్ సపోర్ట్ వంటి ఫీచర్లు కూడా ఉండనున్నాయి. మరోవైపు Honor Magic 9 Lite+ 5G ఇప్పటికే BSN-NX1 మోడల్ నంబర్‌తో Google Play Consoleలో కనిపించినట్లు సమాచారం. దీంతో ఈ ఫోన్ గ్లోబల్ మార్కెట్లోకి వచ్చే అవకాశాలు మరింత పెరిగాయి. అయితే హానర్ ఇప్పటివరకు అధికారిక లాంచ్ తేదీ, ధర వివరాలను వెల్లడించలేదు.
తాజావార్తలు
-
AP Local Body Elections Live Updates : ఏపీలో ఎన్నికల సందడి.. పల్లెలు, పట్టణాల్లో మొదలైన పోలింగ్!
-
9,530mAh బ్యాటరీ, 108MP కెమెరాతో Honor Magic 9 Lite+ 5G..!
-
CM Chandrababu : ఉండవల్లిలో సీఎం చంద్రబాబు ఓటు.. ఓటును ఆయుధంగా వాడుకోవాలని పిలుపు
-
Warangal: బిడ్డను అమ్మేసిన తల్లిదండ్రులు.. అదృశ్యమైందంటూ డ్రామా.. కట్‌చేస్తే..
-
Wiaan Mulder History: ట్రిపుల్ సెంచరీ.. సెంచరీ, 7 వికెట్లు.. 149 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలి ఆటగాడు!
-
Suzuki Ignis EV: Suzuki Ignis EV ఎలక్ట్రిక్ కారు ఆవిష్కరణ.. 26kWh బ్యాటరీ, 90bhp పవర్, పూర్తి వివరాలు ఇవే!
ట్రెండింగ్
-
WBBL 2026: క్రికెట్ చరిత్రలోనే అరుదైన ఘటన.. ఒక్క బంతి ఆడకుండానే క్లీన్ బౌల్డ్..! వీడియో వైరల్..
-
144Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీ, IPX8+IPX9+IP4X రేటింగ్స్‌తో Motorola Razr 2027..!
-
Life Lessons : అమ్మమ్మ ఇచ్చిన తాళంచెవి.. తరాలకు అందించిన నమ్మకం.!
-
Masala Paneer Paratha Recipe: బ్రేక్‌ఫాస్ట్ అయినా, లంచ్ బాక్స్ అయినా.. నోరూరించే ‘మసాలా పన్నీర్ పరాటా’ ఇలా చేసుకోండి..!
-
Fridge Cleaning Tips : ఫ్రిజ్ హ్యాండిల్ జిగటగా మారుతోందా?.. ఖరీదైన క్లీనర్లు లేకుండానే ఇలా సులభంగా శుభ్రం చేయండి