Pushpa 2 Second Single Photo: టాలీవుడ్ మోస్ట్ ఎవెయిటెడ్ ప్రాజెక్ట్‌లలో ‘పుష్ప: ది రూల్’ ఒకటి. లెక్కల మాస్టర్ సుకుమార్ డైరెక్షన్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో కన్నడ సోయగం రష్మిక మందన్న హీరోయిన్. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా పుష్ప 2 విడుదల కానుంది. ఈ సినిమా నుంచి ‘సూసేకి అగ్గిరవ్వ మాదిరే ఉంటాడే నా సామి’ అనే సాంగ్ రాబోతుందని రష్మికతో మేకర్స్ ఓ వీడియో షేర్ చేసిన విషయం తెలిసిందే. నేడు ఆ సాంగ్ లుక్ విడుదల చేశారు.
మైత్రి మూవీ మేకర్స్ తన ఎక్స్‌లో మంగళవారం ఓ పోస్ట్ చేసింది. ‘ఇండియా కా ఫేవరెట్ జోడి పుష్ప రాజ్, శ్రీవల్లి. ఈ జోడి కపుల్ సాంగ్‌తో మనందరినీ మంత్రముగ్ధులను చేయడానికి వస్తోంది. పుష్ప 2 సెకండ్ సింగిల్ రేపు ఉదయం 11.07కి రిలీజ్ అవుతుంది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా.. శ్రేయా ఘోషల్ పాడారు. పుష్ప 2 చిత్రం ఆగష్టు 15న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్’ అని పేర్కొంది. సాంగ్ లుక్ ఫోటోలో అల్లు అర్జున్ బ్లాక్ డ్రెస్‌లో ఉండగా.. రష్మిక బ్లాక్ ప్యాంట్, టీ షర్ట్‌లో వోణీ వేసుకొని ఉన్నారు.
Also Read: Fahadh Faasil Disease: అరుదైన వ్యాధి ఉన్నట్లు ఇటీవలే తెలిసింది: ఫహాద్ ఫాజిల్
ఈ పాటను శ్రేయా ఘోషల్ ఆరు భాషల్లో పాడారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, బెంగాలీ భాషలన్నింటిలో ఆమె పాడటం విశేషం. పుష్ప 2 నుంచి ఇప్పటికే ఫస్ట్ సింగిల్ ‘పుష్ప పుష్ప’ నెట్టింట మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబడుతోంది. సెకండ్ సింగిల్ దుమ్మురేపడానికి సిద్ధమైంది. ఇందులో ఫహద్ ఫాసిల్, జగపతిబాబు, ప్రకాశ్ రాజ్, జగదీష్ ప్రతాప్ బండారి, రావు రమేశ్, సునీల్, అనసూయ భరద్వాజ్, ధనంజయ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా తెరక్కుతున్న విషయం తెలిసిందే.
Pushpa Raj ❤🔥 Srivalli
INDIA KA FAVOURITE JODI are coming to mesmerize us all with #TheCoupleSong 💃🏻🕺#Pushpa2SecondSingle Out tomorrow at 11.07 AM 👌A Rockstar @ThisIsDSP Musical 🎵
Sung by @shreyaghoshal ✨#Pushpa2TheRule Grand release worldwide on 15th AUG 2024.… pic.twitter.com/xeWgKUJfEb— Mythri Movie Makers (@MythriOfficial) May 28, 2024