Fahadh Faasil suffering from ADHD Disease: తాను అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్ తెలిపారు. 41 ఏళ్ల వయస్సులో తనకు అటెన్షన్ డెఫిసిట్ హైపర్యాక్టివిటీ డిజార్డర్ (ఏడీహెచ్‌డీ) వ్యాధి నిర్ధరణ అయినట్లు చెప్పారు. ఇది మెదడు పని తీరుపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఫహాద్ ఫాజిల్ తెలిపారు. ఏకాగ్రత లేకపోవడం, హైపర్ యాక్టివ్, హైపర్ ఫోకస్ వంటి లక్షణాలు ఈ వ్యాధిలో ఉంటాయన్నారు. ఈ వ్యాధి పిల్లల్లో సాధారణమని, పెద్దలకు అరుదుగా వస్తుందని ఫహాద్ ఫాజిల్ పేర్కొన్నారు.
కేరళలోని కోతమంగళంలో తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో ఫహాద్ ఫాజిల్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఏడీహెచ్‌డీ వ్యాధి చికిత్స గురించి డాక్టర్‌ను అడిగారు. 41 ఏళ్ల వయసులో చికిత్స చేయించుకోవచ్చా? లేదా? అనే వివరాలు తెలుసుకున్నారు. చిన్నతనంలోనే ఈ వ్యాధి బయట పెడితే నయం చేయచ్చని, 41 ఏళ్ల వయసులో అసాధ్యం అని డాక్టర్ చెప్పారని ఫహాద్ ఫాజిల్ పేర్కొన్నారు. అంటే జీవితాంతం మలయాళ స్టార్ ఏడీహెచ్‌డీ బాధపడాల్సిందే. విషయం తెలిసిన అందరూ విచారం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Riyan Parag Youtube: హాట్ అందాల కోసం తెగ వెతికాడు.. పరాగ్ అన్న పెద్ద ఆటగాడే!
తెలుగులోనూ ఫాహద్ ఫాజిల్‌కు మంచి గుర్తింపు ఉంది. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ‘పుష్ప’లో ఎస్పీ భన్వర్‌సింగ్ షెకావత్‌గా నటించి అందరి మన్నలు పొందారు. రెండో పార్ట్‌లో ఆయన పాత్ర నిడివి ఎక్కువగా ఉంటుంది. పుష్ప, షెకావత్ పాత్రకు మధ్య చాలా యాక్షన్ సన్నివేశాలు ఉంటాయట. ఇప్పటికే ఫాహద్‌కు సంబంధించిన చిత్రీకరణ పూర్తయినట్లు సమాచారం. భారీ అంచనాల మధ్య పుష్ప 2 ఆగస్టు 15న విడుదల కానుంది. మరోవైపు ఇటీవలే ఆవేశంతో సూపర్ హిట్‌ను అందుకున్నారు. తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా ఈ చిత్రం నిలిచింది.