Laddu Chori: దేశంలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మండపాలలో కొలువైన వినాయకుడు భక్తుల పూజలందుకుంటున్నాడు. దేశ వ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో వినాయకుడికి అంత ప్రాధాన్యత ఇస్తారు. వినాయకుడితో పాటు ఆయన చేతిలో పెట్టిన లడ్డూను కూడా నవరాత్రులలో పూజిస్తారు. ఆ లడ్డూను కూడా నవరాత్రుల చివరి రోజున వేలం వేస్తారు. లడ్డూలు పొందిన వారిని భక్తులు అదృష్టవంతులుగా భావిస్తారు. లడ్డూలు పొందిన కుటుంబానికి ఐశ్వర్యం, ఆరోగ్యం చేకూరుతుందని భక్తుల నమ్ముతారు. అయితే వినాయకుడి చేతిలో వున్న లడ్డూని కొందరు విద్యార్థులు దొంగలించడం కలకలం రేపుతోంది. చార్మినార్ లోని ఘాన్సీ బజార్ గణేష్ మండపంలో చోటుచేసుకుంది.
Read also: Skanda : థమన్ ను తెగ పొగిడేసిన హీరో రామ్..
చార్మినార్‌లోని గణేష్ మండపంలో లడ్డూ చోరీకి గురైంది. పాఠశాల విద్యార్థులు దాదాపు 21 కిలోల లడ్డూలు మోసుకెళ్లడం కలకలం రేపుతోంది. ఘాన్సీ బజార్ గణేష్ మండపంలో కొందరు పాఠశాల విద్యార్థులు 21 కిలోల లడ్డూలను ఎత్తారు. ఈ విషయమై గణేష్ మండపం నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మండపం సమీపంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పాఠశాల నుంచి వెళ్తున్న విద్యార్థులుగా గణేష్ మండపం వద్ద వెళుతూ కనిపించారు. తరువాత ఆ ఇద్దరు విద్యార్థులకు ఎదురుగా మరో విద్యార్థి వచ్చాడు. ఆతరువాత ఇంకో విద్యార్థు సైకిల్ వేసుకుని వచ్చాడు. విద్యార్థులందరూ ఒకరొనొక ఆ మండపంలో ఎవరూ లేరని మట్లాడుకున్నారు. గణేష్ మండపంలో ఒక్కొక్కరూ సైలెంట్ గా లోపలికి వెళ్లారు.
అక్కడి నుంచి వెళ్లేవారు కూడా పిల్లలను పట్టించుకోలేదు. దేవునికి దండం పెట్టేందుకు లోపలికి వెళుతున్నట్లు ఆలోచించి అక్కడి నుంచి వెళ్లిపోతున్నారు. అయితే మండపంలోకి వెళ్లిన విద్యార్థులు వినాయకుడి చేతిలో వున్న 21కిలోల లడ్డూను తీసుకుని తిన్నారు. మళ్లీ ఏమీ తెలియనట్లు బయటకు ఒక్కొక్కరు వచ్చేశారు. ఒకరినొకరు చేయి చేయి కలుపుకుని నవ్వుకుంటూ మెల్లగా జారుకున్నారు. ఈ దృశ్యాలు అక్కడ అమర్చిన సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. దీన్ని పరిశీలించిన పోలీసులు ఆశ్చర్యానికి గురయ్యారు. దొంగతనం చేసిన వాళ్లందరూ మైనర్లు కావడంతో వారు ఎక్కడి నుంచి వచ్చారు ? ఏ స్కూల్ కు చెందినవారు అనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు.
Union Minister in AP: నేడు ఏపీలో ఇద్దరు కేంద్రమంత్రుల పర్యటన