పంజాబ్ కింగ్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. ముంబై బ్యాటర్లలో సూర్య కుమార్ యాదవ్ ( 53 బంతుల్లో 78 పరుగులు, 7 ఫోర్లు, 3 సిక్సులు ), ఓపెనర్ రోహిత్ శర్మ ( 25 బంతుల్లో 36 2 ఫోర్లు, 3 సిక్సులు ), తిలక్ వర్మ ( 18 బంతుల్లో 34 పరుగులు, 2 ఫోర్లు, 2 సిక్సులు ) రాణించగా, పంజాబ్ కింగ్స్ బౌలర్లలో హర్షల్ పటేల్ 3 వికెట్లు తీయగా, సామ్ కరన్ 2 వికెట్లు తీసుకోగా, కగిసో రబాడ ఒక్క వికెట్ తీసుకున్నారు.
Read Also: Karnataka: ప్రేమించడం లేదని కాంగ్రెస్ కార్పొరేటర్ కుమార్తె దారుణహత్య..
ఇక, ముంబై ఇండియన్స్ ఓపెనర్ రోహిత్ శర్మ ఐపీఎల్ లో మరో రికార్డును నమోదు చేశారు. ముంబై తరపున అత్యధిక సిక్సులు కొట్టిన ప్లేయర్ గా నిలిచారు. ఇవాళ పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో 3 సిక్లర్లు బాది కిరన్ పోలార్డ్ ( 223 )ను దాటేశారు. ఆ తర్వాత హార్థిక్ పాండ్యా ( 104 ), ఇషాన్ కిషన్ ( 103 ), సూర్య కుమార్ యాదవ్ ( 95 ) ఉన్నారు. అయితే, ఐపీఎల్ లో అత్యధికంగా 357 సిక్సర్లను క్రిస్ గేల్ కొట్టగా, రోహిత్ శర్మ 275 సిక్సర్లతో రెండో స్థానంలో నిలిచాడు.