ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన కేదార్‌నాథ్ ఆలయ తలుపులు ఈరోజు తెరుచుకున్నాయి. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య అధికారులు ఉదయం 7 గంటలకు ఆలయ ప్రధాన ద్వారాలను తెరిచారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి కుటుంబ సమేతంగా తొలి పూజకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేదారేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Also Read: Post Office Super Plan : పోస్టాఫీస్ సూపర్ ప్లాన్.. రూ. 333 డిపాజిట్ చేస్తే రూ.17 లక్షలు మీ సొంతం..
కేదార్‌నాథ్ ఆలయం 12 జ్యోతిర్లింగాలలో ఒకటి కాగా.. కేదార్‌నాథ్ ఆలయాన్ని సందర్శించడం చార్ధామ్ యాత్రలో భాగం. ప్రతి సంవత్సరం, దేశంలోని వివిధ ప్రాంతాల నుండి వందలాది మంది భక్తులు కేదార్‌నాథ్ స్వామిని దర్శించుకోవడానికి, ప్రత్యేక పూజలు చేయడానికి వస్తారు. అయితే, ఈ ఆలయం శీతాకాలంలో మూసివేయబడుతుంది. దాదాపు ఆరు నెలల పాటు మూసి ఉన్న ఈ ఆలయ తలుపులు భక్తుల దర్శనం కోసం ఈరోజు తెరిచారు. ఈ సందర్భంగా ఆలయాన్ని అధికారులు సర్వాంగ సుందరంగా అలంకరించారు. దాదాపు 40 క్వింటాళ్ల పూలతో ఆలయాన్ని అందంగా అలంకరించారు. కేదారేశ్వరుడిని దర్శించుకునేందుకు భక్తులు ఉదయాన్నే ఆలయం వెలుపల బారులు తీరారు.
Also Read: US: న్యూయార్క్‌లో దారుణం.. మహిళపై దుండగుడి అఘాయిత్యం
మరోవైపు యమునోత్రి ఆలయాన్ని ఉదయం 7 గంటలకు తెరిచారు. గంగోత్రి ఆలయం మధ్యాహ్నం 12:20 గంటలకు తెరవబడుతుంది. చార్ధామ్ యాత్రలో భాగమైన బద్రీనాథ్ ఆలయాన్ని ఈ నెల 12న ప్రారంభించనున్నట్లు బద్రీనాథ్ కేదార్‌నాథ్ ఆలయ కమిటీ చైర్మన్ అజేంద్ర అజయ్ తెలిపారు.
#WATCH | Rudraprayag, Uttarakhand: Huge crowd of devotees from all over the country gather at Shri Kedarnath Dham as the temple portal opens on the occasion of Akshaya Tritiya. pic.twitter.com/q6eUbCjrLZ
— ANI (@ANI) May 10, 2024