Uttarakhand: ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పురోలా, ఉత్తరకాశీ ప్రాంతాలు అట్టుడుకుతున్నాయి. ఎప్పుడు ఏ పరిస్థితి ముంచుకొస్తుందో తెలియడం లేదు. హిందూ, ముస్లిం వర్గాల మధ్య పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. లవ్ జిహాద్ కు వ్యతిరేకంగా హిందూ సంస్థలు ఈ నెల 15న మహాపంచాయత్ కు పిలుపునిచ్చాయి. అయితే ఉత్తరకాశీ యంత్రాంతగా ఇందుకు బుధవారం అనుమతి నిరాకరించింది. మహాపంచాయత్ సమయంలో పరిస్థితి అదుపుతప్పే అవకాశం ఉండటంతో అధికారులు అనుమతి నిరాకరించారు. పురోలా ప్రాంతంలో 144 సెక్షన్ విధించారు.
హర్యానాలో రైతులు ఆందోళన తీవ్రరూపం దాల్చింది.ఈ క్రమంలో జాతీయ రహదారి-44 ను రైతులు దిగ్బంధించారు. పొద్దు తిరుగుడు పంటకు మద్ధతు ధర ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు.ఈ నేపథ్యంలో ఆందోళన చేస్తున్న రైతులకు యూపీ, పంజాబ్ రైతులు మద్దతు తెలిపారు.
దేశ రాజధాని ఢిల్లీలో మళ్లీ పెద్దఎత్తున రైతు ఉద్యమానికి సన్నాహాలు జరుగుతున్నాయి. యునైటెడ్ కిసాన్ మోర్చా పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ఉన్న రైతులు మార్చి 20న పార్లమెంట్ ముట్టడికి సిద్ధమవుతున్నారు.