దేశంలో ఓ వైపు వరకట్నం వేధింపులు పెరుగుతున్నాయి. భర్త, అత్తమామల వేధింపులు తట్టుకోలేక నిండు గర్భిణులు సైతం ఆత్మహత్య చేసుకున్న చాలా ఘటనలు మనం చూసే ఉన్నాం. కానీ.. ఈ విషయం మాత్రం ప్రస్తుతం అందరినీ అబ్బురపరుస్తోంది. కలియుగంలోనూ ఓ యువకుడు పెద్ద మనసు చాటుకున్నాడు. పెళ్లి సందర్భంగా అత్తామామలు ఇచ్చిన రూ.31 లక్షల వరకట్నాన్ని వాళ్లకే తిరిగిచ్చేసి ఆదర్శంగా నిలిచాడు. వరుడి సూచన మేరకు కేవలం రూపాయి నాణెం, ఒక కొబ్బరి కాయతో మొత్తం వివాహ…
హర్యానా రాష్ట్రంలోని కురుక్షేత్రలో రైతులు పొద్దుతిరుగుడు విత్తనాలపై కనీస మద్దతు ధర అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన తర్వాత నిరసనను విరమించుకున్నారు. పొద్దుతిరుగుడు విత్తనాలపై కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి) డిమాండ్‌ను నెరవేర్చడానికి మనోహర్ లాల్ ఖట్టర్ ప్రభుత్వం అంగీకరించడంతో రైతులు మంగళవారం తమ నిరసనను ముగించారు.
హర్యానాలో రైతులు ఆందోళన తీవ్రరూపం దాల్చింది.ఈ క్రమంలో జాతీయ రహదారి-44 ను రైతులు దిగ్బంధించారు. పొద్దు తిరుగుడు పంటకు మద్ధతు ధర ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు.ఈ నేపథ్యంలో ఆందోళన చేస్తున్న రైతులకు యూపీ, పంజాబ్ రైతులు మద్దతు తెలిపారు.
Man's Hand Chopped Off In Haryana: హర్యానాలో దారుణం జరిగింది. ఓ వ్యక్తిపై దాడిచేసి చేయిని నరికేశారు. అంతటితో ఆగకుండా నరికిన చేయిన తీసుకుని వెళ్లారు దుండగులు. ఈ ఘటనలో బాధితులుడు తీవ్రగాయాలపాలై చావుబతుకుల మధ్య ఉన్నారు. హర్యానాలోని కురుక్షేత్రలో ఈ ఘటన జరిగింది. జగ్ను అనే వ్యక్తిపై సదర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కురుక్షేత్ర హవేలీలో ఈ దాడి జరిగింది. ప్రస్తుతం బాధితుడి పరిస్థితి విషమంగా ఉందని.. లోక్‌నాయక్ జై ప్రకాష్ నారాయణ్ ఆసుపత్రి…