కాలేజీ క్యాంపస్ లలో యూదుల వ్యతిరేక నిరసనలు కొనసాగుతుండటాన్ని అమెరికా శ్వేత సౌధం తీవ్రంగా ఖండించింది. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ప్రతి అమెరికన్ కు ఉంది.. కానీ, యూదు విద్యార్థులు, యూదు సమాజంపై భౌతిక దాడులు, హింసకు పిలుపునివ్వడం మాత్రం మంచిది కాదని తెలిపింది. ఇలాంటివి, ప్రమాదకర యూదు వ్యతిరేక చర్యలే అని తెలిపింది. ఇలాంటి, నిరసనలకు ఏ కాలేజీ క్యాంపస్ తో పాటు అమెరికా భూభాగంపై ఎక్కడా చోటు లేదని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ ఆండ్రూ బట్స్ వెల్లడించారు.
Read Also: Padma Awards 2024 : 132 మందికి నేడు పద్మ అవార్డులను అందజేయనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
కాగా, కొలంబియా విశ్వవిద్యాలయంలో కొన్ని రోజుల కిందట జరిగిన పాలస్తీనా అనుకూల నిరసన ర్యాలీని న్యూయార్క్ సిటీ పోలీసులు చెదరగొట్టారు. ఈ కేసులో 100 మందికి పైగా స్టూడెంట్స్ ను అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో శ్వేత సౌధం తన ప్రకటనలో ప్రత్యేకంగా ఏ యూనివర్సిటీ పేరును మాత్రం ప్రస్తావించలేదు.. కానీ ఇజ్రాయెల్– హమాస్ యుద్ధంపై కాలేజీ క్యాంపస్ లలో కొనసాగుతున్న ఉద్రికత్తలు ఈ ఏడాది జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలను ప్రభావితం చూపించే అవకాశం ఉంది.
Read Also: Raja Singh: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై మరో కేసు నమోదు
ఇక, కొలంబియా యూనివర్పిటీలో యూదు వ్యతిరేక నిరసనలను న్యూయార్క్ సిటీ మేయర్ ఎరిక్ ఆడమ్స్ తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనలో చట్ట ఉల్లంఘనలపై విచారణ చేయాలని పోలీసులను ఆదేశించినట్లు తెలిపారు. న్యూయార్క్ నగరంలో ధ్వేషానికి చోటు లేదని చెప్పారు. క్యాంపస్ లో యూదు వ్యతిరేక నిరసనలపై ఏర్పాటైన విచారణ కమిటీ ఎదుట కొలంబియా వర్సిటీ అధ్యక్షుడు నెమాత్ షఫీక్ హాజరై వివరణ ఇచ్చిన తర్వాత రోజే కొలంబియా యూనివర్సిటీలో భారీ ర్యాలీ స్టార్ట్ అయింది. పోలీసులు అరెస్టు చేసిన 108 మంది స్టూడెంట్స్ లో మిన్నెసోటా డెమొక్రాట్ ఇల్హన్ ఒమర్ కుమార్తె ఇస్రా హిర్సీ కూడా ఉన్నట్లు పేర్కొన్నారు.
Read Also: Thalaivar 171 : రజినీకాంత్ సినిమా స్టోరీ లీక్.. డైరెక్టర్ ప్లాన్ మాములుగా లేదుగా..
అయితే, ఇజ్రాయెల్ పై గతేడాది అక్టోబర్ 7వ తేదీన హమాస్ జరిపిన దాడిని కొందరు కొలంబియా ప్రొఫెసర్లు ప్రశంసించినట్లు సమాచారం. దీనిపై షఫీక్ ను పలువురు అమెరికా చట్ట సభల ప్రతినిధులు బుధవారం నాడు ప్రశ్నించారు. వారిలో న్యూయార్క్ రిపబ్లికన్ అయిన ఎల్సీ స్టెఫానిక్ ఒకరు.. యూనివర్సిటీ నిర్వహణలో షఫీక్ నాయకత్వ తీరుపై ఆమె విమర్శలు గుప్పించారు. యేల్ యూనివర్సిటీ క్యాంపస్ లోనూ గత ఆదివారం నిరసనలు కొనసాగాయి. మరోవైపు హార్వర్డ్ యూనివర్సిటీ తమ క్యాంపస్ లో నిరసనలు జరగకూండా కఠిన ఆంక్షలు విధించింది.