మెగాస్టార్ చిరంజీవి తన బాక్సాఫీస్ జోరును ఏమాత్రం తగ్గించడం లేదు. ఇటీవల ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాతో భారీ ఇండస్ట్రీ హిట్ అందుకున్న చిరు, ఇప్పుడు దర్శకుడు బాబీ కొల్లితో కలిసి తన 158వ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లబోతున్నారు. ఈ చిత్రం తండ్రి-కూతుళ్ల సెంటిమెంట్ చుట్టూ తిరిగే కథ అని, ఇందులో చిరు కూతురిగా యంగ్ బ్యూటీ కృతి శెట్టి నటించబోతున్నట్లు సమాచారం. ‘వాల్తేరు వీరయ్య’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్టుకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండటం విశేషం. KVN ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమా షూటింగ్ మార్చిలో ప్రారంభం కానుంది. ఈ సినిమాలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కూడా ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే..
Also Read : Allu Arjun& NTR : సైలెన్స్ వీడాలి.. అల్లు అర్జున్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫైర్!
తాజా సమాచారం ప్రకారం, ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో చిరంజీవి సరసన హీరోయిన్‌గా నేషనల్ అవార్డ్ విన్నింగ్ నటి ప్రియమణి ఖరారైనట్లు తెలుస్తోంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా రాలేదు, కాబట్టి ఈ సరికొత్త జోడి ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగిస్తోంది. కాగా ఈ సినిమాలో ప్రియమణి చిరంజీవి భార్య పాత్రలో కనిపించబోతున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. అలాగే, మరిన్ని వివరాల కోసం అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.