Zia ur Rahman Barq: కరెంటు చోరీకి పాల్పడిన కేసులో ఎస్పీ ఎంపీ జియా ఉర్ రహ్మాన్ బార్క్‌కు విద్యుత్ శాఖ పెద్ద షాకిచ్చింది. ఎస్పీ ఎంపీకి రూ.1 కోటి 91 లక్షల జరిమానా విధించారు. గతంలో విద్యుత్ చౌర్యం కేసులో ఎంపీపై ఆ శాఖ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. విద్యుత్ శాఖ ఉద్యోగులను బెదిరించినందుకు ఎంపీ జియా ఉర్ రెహ్మాన్ బుర్కే తండ్రి మమ్లుక్ ఉర్ రెహ్మాన్‌పై కూడా ఎఫ్‌ఐఆర్ నమోదైంది. వివాదాల మధ్య, స్మార్ట్…
గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించేందుకు భారత ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. ఇప్పుడు భారతీయ రైల్వే కూడా ప్రభుత్వానికి సహాయం చేయడానికి ముందుకు వచ్చింది. నేషనల్ ట్రాన్స్‌పోర్టర్ 2030 నాటికి గ్రీన్ రైల్వేను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
రామనగరి అయోధ్య నుంచి తిరిగివచ్చిన వెంటనే ప్రధాని నరేంద్ర మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. బీజేపీ ప్రభుత్వం కోటి ఇళ్లకు సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఇందుకోసం ‘ప్రధానమంత్రి సూర్యోదయ యోజన’ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ప్రధాని మోదీ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా తెలియజేశారు. కాగా.. ఈ పథకం కింద పేద, మధ్యతరగతి ప్రజల కరెంటు బిల్లు తగ్గుతుందని ప్రధాని మోదీ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. దీనితో పాటు ఇంధన…
స్మార్ట్ సిటీ విశాఖలో అదో స్మార్ట్ భవనం. దూరం నుంచి చూస్తే రోటీన్ గానే కనిపిస్తుంది. దగ్గరకు వెళ్తే ఔరా…!!.అనిపిస్తుంది. ఇంతకు ఏమిటా బిల్డింగ్ ప్రత్యే కత. ఇంత స్మార్ట్ ఆలోచన వెనుక ప్రేరణ ఎవరు..!? అలా విశాఖ వరకూ వెళ్ళొద్దాం రండి. విశాఖలో నిత్యం రద్దీగా ఉండే కూడళ్లలో ప్రధానమైనది గురుద్వారా జంక్షన్. ఇక్కడ ఉన్న ఓ హోటల్ నిర్మాణం రోటీన్ కు భిన్నంగా ఉండటంతో అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ నిర్మాణం 100శాతం గ్రీన్ బిల్డింగ్.…
ఐఐటి ఢిల్లీ మరోమారు తన ప్రతిభను చాటుకున్నది. ఐఐటి ఢిల్లీ విద్యార్థులు సరికొత్త సోలార్ ప్యానల్ ను రూపోందించారు. సాధారణంగా సోలార్ ప్యానల్‌లను ఒకచోట ఫిక్స్ చేస్తే అక్కడి నుంచి సోలార్‌ను గ్రహించి విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తాయి. అయితే, సూర్యుడు ఎప్పుడూ ఒకే ప్రదేశంలో ఉండడు. తూర్పు నుంచి పడమర వైపుకు పనియస్తుంటాడు. దీంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు సోలార్ ప్యానళ్ల ద్వారా కేవలం 25 నుంచి 30 శాతం మాత్రమే విద్యుత్ ఉత్పత్తి చేస్తుంటాయి.…