PM Modi: ఎర్రకోటపై మువ్వన్నెల జెండా ఎగురవేయనున్న ప్రధాని మోడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఢిల్లీలోని ఎర్రకోట ముస్తాబైంది. వరుసగా 10వ సారి ఎర్రకోటపై ప్రధాని మోడీ త్రివర్ణ పతాకాన్ని ఎగువేయనున్నారు. రేపు ఉదయం 7.06 నిమిషాలకు రాజ్ ఘాట్ వద్ద మహాత్మా గాంధీకి ప్రధాని నివాళి అర్పించనున్నారు. అనంతరం 7.18కి ఎర్రకోటకు చేరుకోనున్నారు. ఆ తర్వాత 7.30కు జాతీయ పతాకాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరణ చేయనున్నారు. ప్రధానమంత్రి జాతీయ జెండాను ఎగురవేసిన వెంటనే భారత వైమానిక దళానికి చెందిన మార్క్-III ధ్రువ్ అనే రెండు హెలికాప్టర్లు పూల వర్షం కురిపిస్తాయి. అనంతరం 7.33 నిమిషాలకు జాతిని ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగించనున్నారు.
Suriya: కుటుంబంతో విడిపోయి ముంబైలో మకాం.. సూర్య ఏమన్నాడంటే.. ?
Also Read
- Trump: రేపు ట్రంప్ 80వ బర్త్‌డే.. వైట్‌హౌస్‌లో ప్రత్యేక ఏర్పాట్లు
- Missing Girl: ఆ చిన్నారి నవ్వులు ఏ క్రూరులు లాగేసుకున్నారు..? అంతుచిక్కని తుని మిస్టరీ.. ఏం జరిగింది..?
- Tata Sierra EV: జూన్ 30న టాటా సియెర్రా EV లాంచ్.. 500 కి.మీ. రేంజ్‌తో వస్తున్న SUV
- Work From Bike: వర్క్ ఫ్రం హోం పోయింది.. వర్క్ ఫ్రం బైక్ వచ్చేసింది.. వీడియో వైరల్..
మరోవైపు ఎర్రకోట వద్ద స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు 30 వేల నుంచి 40 వేల వరకు మంది హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి 1,800 మందిని ప్రత్యేక ఆహ్వానితులుగా ఆహ్వానించారు. వీరిలో సర్పంచులు, రైతులు, పార్లమెంట్ నిర్మాణ కార్మికులు, రోడ్ల నిర్మాణ కార్మికులు, ఖాదీ కార్మికులు, హర్ ఘర్ జల్ కార్మికులు, ఉపాధ్యాయులు, నర్సులు, మత్స్యకారులు ఉన్నారు. ఆహ్వానితుల్లో హై-సెక్యూరిటీ జోన్లో 268 మంది వీఐపీలకు చోటు కల్పించారు. ఇప్పటికే ఢిల్లీలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల దృష్ట్యా హై అలర్ట్ ప్రకటించారు. ఎర్రకోట చుట్టూ ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
Vaishnavi Chaithanya: ‘బేబీ’ బ్యూటీ.. అన్ని ఆ డైరెక్టర్ తోనే.. ?
మరోవైపు జ్ఞాన్‌పథ్‌లో 1,000 మందికి, మాధవ్‌దాస్ పార్క్‌లో 4,766 మందికి, ఆగస్ట్ 15 పార్క్‌లో 20,450 మందికి సీటింగ్ ఏర్పాట్లు చేశారు. అంతేకాకుండా 10 వేల మంది భద్రతా సిబ్బందితో నాలుగు అంచెలుగా భద్రతా ఏర్పాట్లు చేశారు. భద్రతకోసం 1,000 సెక్యూరిటీ కెమెరాలు, 16 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరాలు ఏర్పాటు చేశారు. మూడు నుంచి నాలుగు యాంటీ డ్రోన్ సిస్టమ్స్ ఏర్పాటు చేశారు. మరోవైపు భద్రత కోసం ఢిల్లీ పోలీసులతో పాటు కేంద్ర పారా మిలటరీ బలగాలు కూడా పాల్గొననున్నాయి. మరోవైపు సెంట్రల్ ఢిల్లీ, ఎర్రకోట పరిసరాల్లో 144 సెక్షన్ అమల్లోకి తీసుకొచ్చారు.
తాజావార్తలు
-
Maharashtra Politics: మహారాష్ట్రలో ‘ఆపరేషన్ టైగర్’ కలకలం.. షిండే గూటికి ఉద్ధవ్ ఎంపీలు జంప్! మాతోశ్రీలో అర్జెంట్ మీటింగ్..
-
Trump: రేపు ట్రంప్ 80వ బర్త్‌డే.. వైట్‌హౌస్‌లో ప్రత్యేక ఏర్పాట్లు
-
Garlic for High Cholesterol: ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల బ్లాక్స్ తగ్గుతాయా..?
-
Home Remedies : ఇంట్లో చీమల బెడదా.? 2 పదార్థాలతో శాశ్వత పరిష్కారం.!
-
Missing Girl: ఆ చిన్నారి నవ్వులు ఏ క్రూరులు లాగేసుకున్నారు..? అంతుచిక్కని తుని మిస్టరీ.. ఏం జరిగింది..?
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు బెడదా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Nilufer: టర్కీ యువరాణి నుంచి హైదరాబాద్ ప్రజల ఆరాధ్యురాలిగా.. ‘నీలోఫర్’ అసాధారణ ప్రయాణం.!
-
Tirumala ఆలయ అద్భుతాలు.. శాస్త్రానికి అంతుచిక్కని వెంకటేశ్వరుని మహిమలు.!
-
Tirumala: అత్యంత అరుదైన దర్శనం.. ‘వ్యూహ లక్ష్మి అచ్చు’ గురించి తెలుసా.?
-
200MP కెమెరా, 5000 నిట్స్ AMOLED డిస్ప్లే, మిలిటరీ గ్రేడ్ రక్షణతో Motorola Moto G Max 5G లాంచ్.!