హర్యానాలోని అల్-ఫలాహ్ యూనివర్సిటీ వేదికగా జరిగిన ఉగ్ర కుట్రను వెలికితీసే పనిలో దర్యాప్తు అధికారులు నిమగ్నమై ఉన్నారు. ఇక నిన్నటి నుంచి ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. మొత్తం 25 చోట్ల ఏకకాలంలో దాడులు చేశారు. ఈ సోదాల్లో పలు అక్రమాలను గుర్తించారు.
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) రాజ్యసభ సభ్యుడు సంజీవ్ అరోరా తదితరులపై భూ మోసం కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోమవారం జలంధర్, లూథియానా, గురుగ్రామ్, ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహించింది. పంజాబ్‌లోని లూథియానాలోని సంజీవ్ అరోరా నివాసం, హర్యానాలోని గురుగ్రామ్‌తో సహా దాదాపు 16-17 చోట్ల సోదాలు జరుగుతున్నాయి. ఈ దాడికి బీజేపీయే కారణమని ఆప్ నేతలు ఆరోపిస్తున్నారు.
Heera Gold ED: తాజాగా హీరా గోల్డ్ లో సోదాలు ముగిసాయి. 400 కోట్ల రూపాయల వరకు నౌ హీరా షేక్ అక్రమంగా సంపాదించారని గుర్తించారు అధికారులు. రెండు రోజులపాటు ఐదు చోట్ల సోదాలు ఈడి నిర్వహించారు. అధిక మొత్తంలో వడ్డీ ఆశ చూపెట్టి వేల కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు గుర్తించారు. వివిధ స్కీముల ద్వారా పెద్ద మొత్తంలో నౌ హీరా షేక్ వసూళ్లు చేపట్టారు. పెద్ద మొత్తంలో ఆస్తుల పత్రాలను స్వాధీన పరుచుకుంది ఈడి.…
హైదరాబాద్లో మరోసారి ఈడీ దాడులు కలకలం రేపుతున్నాయి. ఆపరేషన్ మొబిలైజేషన్-OM చారిటీ గ్రూప్‌పై 11 చోట్ల ఈడీ సోదాలు చేసింది. విదేశాల నుంచి విరాళాలు తీసుకుని దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు రావడంతో ఈ సోదాలు చేపట్టింది. రూ.300 కోట్ల విరాళాలు సేకరించినట్లు ఆరోపణలు వచ్చాయని వారు తెలిపారు.