ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) రాజ్యసభ సభ్యుడు సంజీవ్ అరోరా తదితరులపై భూ మోసం కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోమవారం జలంధర్, లూథియానా, గురుగ్రామ్, ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహించింది. పంజాబ్‌లోని లూథియానాలోని సంజీవ్ అరోరా నివాసం, హర్యానాలోని గురుగ్రామ్‌తో సహా దాదాపు 16-17 చోట్ల సోదాలు జరుగుతున్నాయి. ఈ దాడికి బీజేపీయే కారణమని ఆప్ నేతలు ఆరోపిస్తున్నారు.