Santosham OTT Awards 2023 Winners List Full Details Here: 22వ సంతోషం అవార్డ్సు వేడుకను డిసెంబర్ 2వ తేదీన గోవాలో భారీగా నిర్వహించటానికి ఏర్పాట్లు చేస్తున్నారు సంతోషం సురేష్ కొండేటి. అలాగే ఓటీటీ పేరుతో థియేటర్స్‌కు ప్రత్యామ్నాయంగా ప్రేక్షకుడి ఇంటికే వచ్చేసిన వినోదాన్ని కూడా సత్కరించి, ప్రోత్సహించాలనే ఉద్దేశంతో గత సంవత్సరం ‘సంతోషం`ఓటీటీ’ అవార్డ్స్ పేరుతో ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలకు సైతం అవార్డులు ఇవ్వడం మొదలు పెట్టగా ఈ ఓటీటీ అవార్డ్స్ రెండో సంవత్సర వేడుకల్ని శనివారం హైదరాబాద్‌లోని పార్క్‌హయత్‌లో సినీ ప్రముఖుల మధ్య నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మురళీమోహన్, జయసుధ, సంచలన రచయితలు విజయేంద్రప్రసాద్, సత్యానంద్, ఎస్.వి. కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, తమ్మారెడ్డి భరద్వాజ, కె.యస్. రామారావు, జేడీ చక్రవర్తి, వేణు, నిరుపమ్, ఓంకార్, సుహాస్, అనసూయ, హంసానందిని, డిరపుల్ హయత్, జోష్ రవి, దర్శకులు వశిష్ట, సాయిరాజేష్, రేలంగి నరసింహారావు, నిర్మాతలు రాధామోహన్, వాసు, ఎస్‌కెఎన్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, టి. ప్రన్నకుమార్ తో పాటు పలువురు ఇతరులు సైతం పాల్గొన్నారు. యాంకర్ రవి, వర్ష, ఇమ్మానుయేల్ వ్యాఖ్యాతలుగా వ్యవహరించిన ఈ వేడుకలో అవార్డులు అందుకున్న వారి వివరాలు ఇలా ఉన్నాయి.
అవార్డు విన్నర్స్ :
1. బెస్ట్ మూవీ : ప్రేమ విమానం (నిర్మాత అభిషేక్ నామా)
2. బెస్ట్ యాక్టర్ : జె.డి. చక్రవర్తి (దయ)
3. క్రిటిక్స్ బెస్ట్ యాక్టర్ : వేణు తొట్టెంపూడి (అతిథి)
4. బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ : ఓంకార్ (మేషన్ 24)
5. బెస్ట్ డైరెక్టర్ : ఆనంద్ రంగా (వ్యవస్థ)
6. బెస్ట్ సపోర్టింగ్ డెబ్యూ ఆర్టిస్ట్ : శ్రీనివాస్ గారిరెడ్డి
7. బెస్ట్ సపోర్టింగ్ క్యారెక్టర్ : జోష్ రవి (దయ)
8. బెస్ట్ సపోర్టింగ్ నటి : అనసూయ (ప్రేమ విమానం)
9. బెస్ట్ విలన్ : సుహాస్ (యాంగర్ టెయిల్స్)
10. బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ : అనూప్ రూబెన్స్ (నిశానీ)
11. బెస్ట్ సినిమాటోగ్రఫీ : వివేక్ కాలెపు (దయ)
12. బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ : అనిరుద్, దేవాన్ష్ (ప్రేమ విమానం)