G-20 సమ్మిట్ విందులో ప్రతిపక్ష అలయన్స్ ఇండియా (I.N.D.I.A.) నాయకులు హాజరుకావడంతో అనేక ఊహాగానాలు మొదలయ్యాయి. శనివారం (సెప్టెంబర్ 9) జరిగిన ఈ విందుకు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌తో పాటు ఇతర నేతలు కూడా హాజరయ్యారు. ఈ విందులో పాల్గొన్న ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ప్రధాని మోడీ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
G20 Summit: ఢిల్లీలో సెప్టెంబరు 9, 10 తేదీల్లో జరగనున్న జి-20 సదస్సుకు సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. కాగా, దేశాధ్యక్షురాలు ద్రౌపది ముర్ము ఏర్పాటు చేసిన జీ20 విందుకు మాజీ ప్రధాని హెచ్‌డి దేవెగౌడ హాజరుకావడం లేదని వార్తలు వచ్చాయి.
ఇండియన్ నేవీలోకి సరికొత్త యుద్ధనౌక చేరింది. ఐఎన్ఎస్ వింధ్యగిరిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించారు. ప్రాదేశిక సముద్ర జలాలపై భారత నావికాదళానికి మరింత పట్టును అందించనుంది స్టెల్త్ యుద్ధనౌక.
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. ఈ బిల్లుకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ ను రాష్ట్రపతి భవన్ విడుదల చేసింది. దీంతో ఈ బిల్లు ఇప్పుడు చట్టంగా మారింది. ఇదే విషయంపై కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ సోషల్ మీడియాలో తెలిపారు. “DPDP చట్టంగా మారింది. రాష్ట్రపతి ఆమోదం తెలిపారు." అని ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు.
రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్ముకు క్రాస్ ఓటింగ్ వేసిన తన మంత్రివర్గంలోని మంత్రులకు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కృతజ్ఞతలు తెలిపారు. NDA అభ్యర్థి ద్రౌపది ముర్ము ఎన్నికల్లో విజయం సాధించి భారతదేశ తదుపరి రాష్ట్రపతి అవుతారని వెల్లడించారు. ముర్ము గెలుపును సంబరాలు చేసుకుంటూ, శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ, “తమ మనస్సాక్షి మాటను విని, ద్రౌపది ముర్మును తదుపరి అధ్యక్షురాలిగా చేయాలని నిర్ణయించుకున్న ఇతర పార్టీల ఎమ్మెల్యేలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. “గిరిజన…