BRS First List: గెలుపు గుర్రాలు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ ఇదే..?!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BRS First List: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడింది.. ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు తమ వ్యూహాలకు పదునుపెడుతున్నాయి.. పనిలో పనిగా పార్టీలు మారేవారు.. చేరేవారు.. వెళ్లివారి సందడి కూడా సాగుతోంది.. ఇక, ఎన్నికల వ్యూహాలకు పదును పెంచారు బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు.. అన్ని పార్టీల కంటే ముందే అభ్యర్థులకు ప్రకటించేందుకు సిద్ధం అయ్యారు.. అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు.. ఇప్పటికే కొందరి పేర్లను ఖరారు చేసినట్టు కూడా తెలుస్తోంది.. ప్రస్తుతం కొందరు అభ్యర్థుల పేర్లు ప్రచారంలో ఉన్నాయి.
గులాబీదళపతి కేసీఆర్ ఫైనల్ చేసినట్టు ప్రచారంలో ఉన్న కొందరు అభ్యర్థుల విషయానికి వస్తే.. 10 ఉమ్మడి జిల్లాల్లో 51 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లు బయటకు వచ్చాయి. వైరల్‌గా మారిన లిస్ట్‌లో చాలా మంది సిట్టింగ్‌ల పేర్లే కనిపిస్తున్నాయి.. ఒకటి రెండు స్థానాల్లో మాత్రమే కొత్త వ్యక్తుల పేర్లు కనిపిస్తున్నాయి.. అయితే.. 51 మందితో తొలి జాబితాను సిద్ధం చేసిన కేసీఆర్.. ఈ నెల 21వ తేదీన ప్రకటించబోతున్నారట. గత ఎన్నికల్లో వందకు పైగా స్థానాలకు ఒకేసారి అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్.. ఇప్పుడు మాత్రం సగం జాబితాను ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నారట.. ఈ సారి టికెట్లు ఆశించేవారి సంఖ్య పెరగడంతో.. వివాదంలేని స్థానాలకు అభ్యర్థులను ఫైనల్ చేశారట.. కేసీఆర్‌కు 6 అంకే సెంటిమెంట్.. అందుకు అనుగుణంగానే 51 స్థానాలల అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందంటున్నారు.
Also Read
ఇక, ఇప్పటి వరకు అందుతోన్న సమాచారం ప్రకారం.. సీఎం కేసీఆర్ ప్రకటించే అవకాశం ఉన్న అభ్యర్థుల పేర్లు ఇలా ఉన్నాయి. రాష్ట్రంలోని 10 ఉమ్మడి జిల్లాల నుంచి ఫైనల్ అయిన అభ్యర్థులు వీరే అనే ప్రచారం సాగుతోంది..
ఆదిలాబాద్:
1. సిర్‌పూర్ కాగజ్‌నగర్-కోనేరు కోనప్ప
2. ఆదిలాబాద్-జోగురామన్న
3. నిర్మల్-ఇంద్రకరణ్‌రెడ్డి
నిజామాబాద్:
4. జుక్కుల్-హనుమంత్ షిండే
5. ఆర్మూర్-జీవన్‌రెడ్డి
6. బాన్సువాడ-పోచారం శ్రీనివాస్‌రెడ్డి
7. బాల్కొండ-వేముల ప్రశాంత్‌రెడ్డి
కరీంనగర్:
8. సిరిసిల్ల – కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్)
9. హుస్నాబాద్ – సతీష్‌బాబు
10. హుజూరాబాద్ -కౌశిక్‌రెడ్డి
11. కరీంనగర్-గంగుల కమలాకర్
12. కోరుట్ల-కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు
మెదక్:
13. సిద్దిపేట-తన్నీరు హరీష్‌రావు
14. నారాయణఖేడ్-భూపాల్‌రెడ్డి
15. పఠాన్‌చెరు-మహిపాల్‌రెడ్డి
16. దుబ్బాక-కొత్త ప్రభాకర్‌రెడ్డి
హైదరాబాద్-రంగారెడ్డి ఉమ్మడి జిల్లాలు
17. మేడ్చల్-చామకూర మల్లారెడ్డి
18. మల్కాజ్‌గిరి-మైనంపల్లి హనుమంతరావు
19. కూకట్‌పల్లి-మాధవరం కృష్ణారావు
20. ఎల్బీ నగర్-సుధీర్‌రెడ్డి
21. మహేశ్వరం-సబితాఇంద్రారెడ్డి
22. శేరిలింగంపల్లి-అరికెపూడి గాంధీ
23. వికారాబాద్-మెతుకు ఆనంద్
24. తాండూర్-పైలెట్ రోహిత్‌రెడ్డి
25. సనత్‌నగర్-తలసాని శ్రీనివాస్‌యాదవ్
26. సికింద్రాబాద్-పద్మారావు
మహబూబ్‌నగర్
27. మహబూబ్‌నగర్ -శ్రీనివాస్‌గౌడ్
28. జడ్చర్ల-లక్ష్మారెడ్డి
29. దేవరకద్ర – వెంకటేశ్వర్‌రెడ్డి
30. నాగర్‌కర్నూల్-మర్రి జనార్దన్ రెడ్డి
31. నారాయణ్‌పేట-రాజేందర్‌రెడ్డి
32. వనపర్తి-సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
33. కొల్లాపూర్-బీరం హర్షవర్ధన్‌రెడ్డి
నల్గొండ:
34. మిర్యాలగూడ-భాస్కర్‌రావు
35. హుజూర్‌నగర్-సైదిరెడ్డి
36. దేవరకొండ-రవీంద్రనాయక్
37. సూర్యపేట – జగదీశ్వర్‌రెడ్డి
38. తుంగతుర్తి-గాదరి కిషోర్
39. నకిరేకల్-చిరుమర్తి లింగయ్య
వరంగల్:
40. స్టేషన్‌ఘన్‌పూర్-కడియం శ్రీహరి
41. జనగాం-పల్లా రాజేశ్వర్‌రెడ్డి
42. వరంగల్ పశ్చిమం-వినయ్ భాస్కర్
43. పరకాల-చల్ల ధర్మారెడ్డి
44. భూపాల్‌పల్లి-గండ్ర వెంకటరమణారెడ్డి
45. నర్సంపేట-పెద్ది సుదర్శన్‌రెడ్డి
46. వర్ధన్నపేట-ఆరూరి రమేష్
47. పాలకుర్తి-ఎర్రబెల్లి దయాకర్‌రావు
ఖమ్మం:
48. ఖమ్మం – పువ్వాడ అజయ్
49. సత్తుపల్లి-సండ్ర వెంకటవీరయ్య
50. అశ్వరావుపేట-నాగేశ్వరరావు
51. పినపాక-రేగ కాంతారావు
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!