President Droupadi Murmu: లఖ్పతి దీదీలు కాదు.. కరోడ్పతి దీదీలుగా ఎదగాలి.. రాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
President Droupadi Murmu: గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు ఆర్థికంగా స్వయం సాధికారత సాధించడంతో పాటు లక్షాధికారుల నుంచి కోటీశ్వరులుగా ఎదగాలని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆకాంక్షించారు. అమరావతిలో నిర్వహించిన జాతీయ సరస్ మేళా–2026 కార్యక్రమంలో ఆమె ప్రసంగించారు. దేవీ శరన్నవరాత్రుల పర్వదినాల్లో కనకదుర్గమ్మ సన్నిధిలో జాతీయ సరస్ మేళాను ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. ఢిల్లీ వెలుపల తొలిసారిగా స్వయం సహాయక సంఘాల జాతీయ సరస్ మేళాను నిర్వహించిన కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖను రాష్ట్రపతి అభినందించారు.
గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు ఆర్థికంగా సాధికారత సాధించేలా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేక చర్యలు చేపడుతున్నారని ద్రౌపదీ ముర్ము తెలిపారు. స్వయం సహాయక సంఘాలకు చెందిన మహిళలు సాంకేతిక, ఆర్థిక రంగాల్లో పెద్ద ఎత్తున భాగస్వాములవుతున్నారని పేర్కొన్నారు. మహిళలను కేవలం ‘లఖ్పతి దీదీ’లుగా కాకుండా ‘కరోడ్పతి దీదీ’లుగా తీర్చిదిద్దేందుకు మరింత కృషి జరగాలని ఆకాంక్షించారు రాష్ట్రపతి..
Also Read
- Janasena Leaders Meet Chandrababu: జనసేనలో అంతర్మథనం.. సీట్ల సంఖ్యపై కేడర్ అసంతృప్తి.. మరోసారి చంద్రబాబుతో కీలక భేటీ
- AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
- Jana Sena Party: జనసేనలోకి పలువురు వైసీపీ నేతలు, ప్రముఖులు.. పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన పవన్ కల్యాణ్..
- AP Alliance Seat Sharing: సీట్ల సర్దుబాటుపై చర్చలు కొలిక్కి.. కూటమి నుంచి సింగిల్ లిస్ట్.. బొలిశెట్టి కీలక వ్యాఖ్యలు
ఇక, గ్రామీణ ప్రాంతాల్లోని మహిళా రైతులు స్వయం సాధికారత సాధించేలా అవసరమైన సహకారం అందించాలని రాష్ట్రపతి సూచించారు. మహిళలు తమ ఉత్పత్తులను నేరుగా విక్రయించుకునేలా మధ్యవర్తుల వ్యవస్థను తొలగించేందుకు అన్ని వ్యవస్థల్లోనూ మార్పులు రావాలని అభిప్రాయపడ్డారు. గ్రామీణ మహిళలకు డిజిటల్ మాధ్యమాలు, డిజిటల్ విధానాలపై మరింత అవగాహన కల్పించాలని కోరారు. తద్వారా వారు ఆధునిక సాంకేతికతను వినియోగించుకుంటూ ఆర్థికంగా మరింత అభివృద్ధి సాధించగలరని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్కు పొరుగునే ఒడిశా రాష్ట్రం ఉన్నప్పటికీ, తాను తెలుగు భాషలో మాట్లాడలేకపోతున్నానని రాష్ట్రపతి అన్నారు. త్వరలోనే తెలుగు భాషను నేర్చుకుని, మరోసారి వచ్చి తెలుగులోనే ప్రజలతో మాట్లాడతానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా తెలుగు భాషపై తన అభిమానాన్ని చాటుకున్నారు.
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి భగవాన్ విష్ణువు మరో రూపమని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పేర్కొన్నారు. అమరావతిలో కనిపించే శిల్పకళా చాతుర్యం ఆంధ్రప్రదేశ్ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిరూపమని అన్నారు. మహిళా సాధికారత, గ్రామీణ ఆర్థికాభివృద్ధి, సాంకేతిక పరిజ్ఞాన వినియోగం వంటి అంశాలపై ఆమె చేసిన వ్యాఖ్యలు జాతీయ సరస్ మేళా ప్రాధాన్యాన్ని చాటిచెప్పాయి అని వ్యాఖ్యానించారు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము..
తాజావార్తలు
-
Box Office: ఫ్లాపులొచ్చినా రేటు తగ్గించేది లేదంటున్న ఆ హీరోలు..
-
India-US: హిందూ ఆలయంపై దాడికి కుట్ర ఆరోపణలు.. అమెరికాకు భారత్ కీలక విజ్ఞప్తి
-
Bhatti Vikramarka : తెలంగాణలో పెట్టుబడులకు అండగా ఉంటాం..
-
BYD Atto 8 EV: కేవలం 9 నిమిషాల్లో 97% ఛార్జింగ్! BYD కొత్త ఎలక్ట్రిక్ SUV.. 651 కి.మీ. రేంజ్తో వస్తోంది!
-
Janasena Leaders Meet Chandrababu: జనసేనలో అంతర్మథనం.. సీట్ల సంఖ్యపై కేడర్ అసంతృప్తి.. మరోసారి చంద్రబాబుతో కీలక భేటీ
ట్రెండింగ్
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్గా పెంచుకోండి..